కెన్యాలో డ్యామ్ తెగిన ఘటనలో 42 మంది మృతి చెందారు. పలువురు బురదలో కూరుకుపోయారు. వారి కోసం అధికారులు గాలిస్తున్నారు. కాగా.. కెన్యాలో కొన్ని రోజులుగా అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో.. ఓ డ్యామ్ తెగిపోయి అక్కడి జనాన్ని అతలాకుతలం చేసింది. నకురు కౌంటీలోని మాయి మహియు పట్టణ సమీపంలోని డ్యామ్ లో నీటి ఒత్తిడికి కట్ట తెగిపోయింది. ఆ నీరంతా సమీపంలోని ఊళ్లను ముంచెత్తింది. దీంతో పెద్ద సంఖ్యలో ఇళ్లు కొట్టుకుపోగా.. రోడ్లు తెగిపోయాయి. అంతేకాకుండా.. 42 మంది మృత దేహాలను అధికారులను గుర్తించారు.
Sabari: ‘శబరి’ టైటిల్ అందుకే పెట్టాం.. వరలక్ష్మీని ఎంచుకున్నాం: దర్శకుడు అనిల్ ఇంటర్వ్యూ
పెద్ద సంఖ్యలో ఇళ్లు కొట్టుకుపోవడంతో.. చాలా మంది గల్లంతయ్యారు. దీంతో ఇళ్ల శిథిలాల్లో, ఆ చుట్టు పక్కల ప్రాంతాల్లో పేరుకుపోయిన బురదలో మృతదేహాల కోసం స్థానిక అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. కాగా.. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. వేగంగా సహాయక చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు. మరోవైపు.. కొన్ని రోజుల నుంచి కెన్యాలో భారీ వర్షాలు కురుస్తుండటంతో వరదలు ముంచెత్తుతున్నాయి.
CM Jagan: మరో రెండు వారాల్లో కురుక్షేత్రం.. కౌరవ సైన్యాన్ని ప్రజలు నమ్మొద్దు..
ఈ క్రమంలో.. మార్చి, ఏప్రిల్ నెలల్లో దాదాపు 120 మందికిపైగా చనిపోయినట్లు ఆ దేశ అధికారులు తెలిపారు. అంతేకాకుండా.. 24 వేలకు పైగా ఇళ్లు నీట మునిగిపోగా.. లక్షలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని వెల్లడించారు. భారీ వర్షాలు, వరదలతో కెన్యా వ్యాప్తంగా విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. అటు.. కెన్యా పక్కనే ఉన్న టాంజానియా, బురుండి, ఉగాండా దేశాల్లోనూ వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వరదల ధాటికి ఆ దేశాల్లో వందలాది మంది మరణించినట్టు ఐక్యరాజ్య సమితి ఇటీవల వెల్లడించింది.