Site icon NTV Telugu

Stray Dogs : నిర్మల్‌లో వీధికుక్కల దాడిలో నాలుగేళ్ల బాలిక మృతి

Dogs Attack

Dogs Attack

మార్చి 2న వీధికుక్కల గుంపు దాడి చేయడంతో తీవ్ర గాయాలపాలైన నాలుగేళ్ల బాలిక శుక్రవారం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. తాటిగూడ గ్రామానికి చెందిన భూక్య శాన్వి వీధికుక్క దాడిలో తీవ్రంగా గాయపడి జిల్లా కేంద్రంలోని ఆస్పత్రిలో చేరింది. ఆమె ఒక రైతు అమర్ సింగ్‌కి ఏకైక కుమార్తె కాగా, ఆమె తల్లి సరిత గృహిణి. వీధికుక్కల బెడద నివారణకు చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అమర్ సింగ్ అధికారులను అభ్యర్థించారు. పెంబి మండలంలోని పలు ప్రాంతాల్లో చిన్నపిల్లలు, వృద్ధులపై కుక్కలు అడపాదడపా దాడులు చేస్తున్నాయని స్థానికులు తెలిపారు. తమ పిల్లలు, వృద్ధుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు.

ఇదిలా ఉంటే.. మంచిర్యాల జిల్లా, భీమిని మండలం, కేస్లాపూర్‌లో అమానవీయ ఘటన జరిగింది. వీధికుక్కల దాడిలో ఎనిమిది నెలల చిన్నారి మృతి చెందింది. బుధవారం రాత్రి చిన్నారిని ఓ మహిళ పంట చేనులో వదిలి వెళ్లిపోయింది. వీధి కుక్కలు ఆ చిన్నారిని పీక్కుతిన్నాయి. ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు నిందితురాలు గంగను అదుపులోకి తీసుకొని విచారిసున్నారు.

 

Exit mobile version