Site icon NTV Telugu

H1N1 Flu: ఆ వైరస్ కారణంగా 4 నెలల శిశువు మృతి.. మూడు రోజుల్లో రెండవ మరణం..!

H1n1

H1n1

H1N1 Flu: అసోంలో స్వైన్ ఫ్లూ వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఇక్కడ హెచ్1ఎన్1 వైరస్ సోకి 4 నెలల చిన్నారి మృతి చెందింది. గత మూడు రోజుల్లో రాష్ట్రంలో స్వైన్ ఫ్లూ కారణంగా రెండో మరణం సంభవించింది. చిన్నారి సిల్చార్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్ (SMCH)లో చికిత్స పొందుతున్నట్లు అధికారులు తెలిపారు. ఇక, ఆరోగ్య అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మరణించిన చిన్నారిని అర్మాన్ హుస్సేన్ లస్కర్ గా గుర్తించారు. క్యాచర్ జిల్లాలోని ఉత్తర కృష్ణాపూర్ ప్రాంతంలో శిశువు కుటుంబం జీవనం కొనసాగిస్తుంది. ఇన్‌ఫ్లుఎంజా కారణంగా ఏప్రిల్ 12వ తేదీన సిల్చార్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్లో చేర్చించారు. చిన్నారిని ప్రాణాపాయ స్థితిలోకి ఉండటంతో వెంటనే ఆస్పత్రికి తరలించగా హెచ్‌1ఎన్‌1 వైరస్‌ ఉన్నట్లు గుర్తించామని ఎస్‌ఎంసిహెచ్‌ సీనియర్‌ వైద్యుడు తెలిపారు.

Read Also: Manushi Chhillar: సరికొత్త పోజులతో పరువాలు ఒలకబోస్తున్న మానుషి చిల్లర్…

ఇక, ఆసుపత్రి వైద్యులు మాట్లాడుతూ.. చికిత్స ప్రారంభంలో, శిశువు బాగా స్పందించింది.. కానీ ఏప్రిల్ చివరి వారంలో అతని ఆరోగ్య పరిస్థితి క్షీణించిందని పేర్కొన్నారు. RT-PCR పరీక్షను నిర్వహించి చిన్నారికి హెచ్1ఎన్1 వైరస్ సోకింది అనే విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేశామన్నారు. కాగా, ఎస్‌ఎంసీహెచ్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ భాస్కర్‌ గుప్తా మాట్లాడుతూ.. చిన్నారికి హెచ్‌1ఎన్‌1 సోకినా.. ఇతర వ్యాధులతో మృతి చెందాడు అని చెప్పారు. H1N1 వైరస్ అతని శరీరాన్ని మరింత బలహీనపరిచింది.. ఇదే ఆ చిన్నారి మరణానికి దారితీసిందన్నారు.

Read Also: Komatireddy: కేసీఆర్ గురించి మాట్లాడటమే వేస్ట్.. కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు..

అయితే, H1N1 వైరస్‌ని స్వైన్ ఫ్లూ అని కూడా పిలుస్తాము. దీనితో బాధపడుతున్న వ్యక్తి జ్వరం, అలసట, ఆకలి లేకపోవడం, దగ్గు, గొంతు నొప్పితో పాటు వాంతులు, విరేచనాలు కూడా ఉండవచ్చు అని డాక్టర్లు తెలియజేస్తున్నారు. ఇన్ఫ్లుఎంజా A (H1N1) సోకిన కొంతమందికి, వ్యాధి యొక్క ప్రభావాలు తీవ్రంగా ఉంటడంతో మరణానికి కూడా దారితీయవచ్చు అంటూ వెల్లడించారు.

Exit mobile version