Site icon NTV Telugu

Fight in Wedding: వివాహ వేడుకలో తలెత్తిన గొడవ.. నలుగురు మృతి

Fight In Wedding

Fight In Wedding

Fight in Wedding: కుటుంబసభ్యులతో కలిసి అంగరంగ వైభవంగా జరుపుకోవాల్సి వెళ్లి వేడుక విషాదంగా మారింది. పెళ్లికి ఆతిథ్యం ఇస్తున్న ఓ రెస్టారెంట్‌ ముందు గొడవ.. తీవ్రంగా మారి నలుగురు వ్యక్తుల మృతికి దారితీసింది.

స్పెయిన్‌లోని మాడ్రిడ్‌కు ఈశాన్యంగా 25 కిలోమీటర్ల (16 మైళ్లు) దూరంలో ఉన్న టోర్రెజోన్ డి అర్డోజ్‌లో వివాహాన్ని నిర్వహిస్తున్న రెస్టారెంట్ ముందు ఏమైందో ఏమో తెల్లవారుజామున పోరాటం చెలరేగింది. ఇరువర్గాల మధ్య చిన్నగా మొదలైన గొడవ కాసేపట్లో మరింత రసాభాసగా మారింది. వివాదం అనంతరం ఓ కారు పెళ్లికి వచ్చిన అతిథులపైకి దూసుకెళ్లి అక్కడి నుంచి వెళ్లిపోయింది. దీంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.

Parachute Stunts At Rahul yatra: పారాచూట్ తో యువకుడి విన్యాసాలు.. వైరల్

ఆదివారం తెల్లవారుజామున స్పెయిన్‌లోని వివాహ వేడుకలో జరిగిన గొడవ తర్వాత కారు ఢీకొనడంతో నలుగురు వ్యక్తులు మరణించగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు తెలిపారు. అధికారులు ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న నాలుగో వ్యక్తి కోసం వెతుకుతున్నారు. గాయపడిన మరో నలుగురిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. అయితే దాడికి పాల్పడినట్లు అనుమానిస్తున్న వాహనం ప్రమాదం జరిగిన ప్రదేశానికి 50 కిలోమీటర్ల దూరంలో కనిపించిందని, అందులో ఉన్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. స్థానిక మీడియా ఈ ముగ్గురిని తండ్రి, అతని ఇద్దరు పిల్లలుగా గుర్తించింది. ప్రమేయం ఉన్నట్లు భావిస్తున్న నాలుగో నిందితుడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Exit mobile version