NTV Telugu Site icon

Pakistan: వణికిస్తున్న భూకంపాలు.. పాకిస్తాన్‌లో 4.6 తీవ్రతతో భూకంపం

Earthquakebihar

Earthquakebihar

వరుస భూకంపాలు ప్రజలను వణికిస్తున్నాయి. ఇటీవల మయన్మార్, బ్యాంకాక్, చైనా వంటి దేశాల్లో భూకంపాలు సంభవించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మయన్మార్, బ్యాంకాక్ అతలాకుతలం అయ్యాయి. పదుల సంఖ్యలో భవనాలు నేలమట్టమయ్యాయి. వందలాది మంది మృత్యువాత పడ్డారు. ఈ ఘటన మరువక ముందే పాకిస్తాన్ లో భూకంపం చోటుచేసుకుంది. పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ ప్రాంతంలో సోమవారం 4.6 తీవ్రతతో భూకంపం సంభవించింది. బలూచిస్తాన్‌లోని ఉతల్ నగరానికి తూర్పు-ఆగ్నేయంగా 65 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉందని USGS తెలిపింది.

Also Read:MI vs KKR: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్.. ఈసారైనా మ్యాచ్ గెలిచేనా?

భూకంప కేంద్రం 10 కిలోమీటర్ల లోతులో వ్యాపించి ఉందని అధికారులు తెలిపారు. భూకంపం కారణంగా ఆస్తి, ప్రాణ నష్టం జరిగినట్లు ఇంకా తెలియరాలేదు. కరాచీలో కూడా భూకంప ప్రకంపనలు సంభవించాయని కొంతమంది సోషల్ మీడియాలో పేర్కొన్నారు. భూకంప తీవ్రత తక్కువగా ఉండడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. రోజుల వ్యవధిలోనే భూకంపాలు సంభవిస్తుండడంతో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.