Most Runs In One Over: సమోవా బ్యాటర్ డేరియస్ విస్సెర్ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఒకే ఓవర్‌లో అత్యధిక పరుగులు రాబట్టిన బ్యాటర్‌గా నిలిచాడు. ఈస్ట్ ఆసియా-పసిఫిక్ సబ్ రీజనల్‌లో భాగంగా సమోవా, వనువాటు దేశాల మధ్య జరిగిన మ్యాచ్‌లో విస్సెర్ ఒకే ఓవర్‌లో 39 రన్స్ చేశాడు. సమోవా ఇన్నింగ్స్‌లోని 15వ ఓవర్‌ను వనువాటు బౌలర్ నిలిన్ నిపికో వేయగా.. విస్సెర్ ఏకంగా 39 పరుగులు పిండుకున్నాడు. గతంలో ఈ రికార్డు 38 పరుగులుగా ఉంది.
ఓవరాల్ టీ20లో ఒక ఓవర్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా డేరియస్ విస్సెర్ నిలిచాడు. అంతకుముందు ఈ రికార్డు 38 పరుగులు. 24 జూలై 2012న ససెక్స్, గ్లౌసెస్టర్‌షైర్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ ఫీట్ నమోదైంది. అయితే అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో ఒక ఓవర్‌లో అత్యధికంగా నమోదైన పరుగులు మాత్రం 36. యువరాజ్ సింగ్ (2007), కీరన్ పొలార్డ్ (2021), నికోలస్ పూరన్ (2024), దీపేంద్ర సింగ్ (2024) మాత్రమే 36 పరుగులు చేశారు. యువరాజ్, పొలార్డ్ మాత్రమే వరుసగా ఆరు సిక్స్‌లు బాదేశారు.
Also Read: Janhvi Kapoor: నువ్వేందిరా సామీ.. జాన్వీ కపూర్‌తో రాఖీ కట్టించుకున్నావ్! వీడియో వైరల్
డేరియస్ విస్సెర్ ఆరు సిక్సుల వీరుల జాబితాలో కూడా చేరాడు. అయితే వరుసగా మాత్రం కొట్టలేదు. వనువాటు బౌలర్ నిలిన్ నిపికో అదనంగా మూడు నో బాల్స్ వేయడంతో.. విస్సెర్ ఒకే ఓవర్‌లో (6, 6, 6, నోబాల్, 6, 0, నో బాల్, నో బాల్+6, 6) ఆరు సిక్సులు బాదాడు. ఇక సమోవా తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో సెంచరీ (132 పరుగులు; 62 బంతుల్లో 14 సిక్స్‌లు, 5 ఫోర్లు) సాధించిన తొలి ఆటగాడిగా విస్సెర్ రికార్డు సృష్టించాడు.
🚨WORLD RECORD CREATED IN MEN’S T20 LEVEL 1 OVER 39 RUNS
Darius Visser scored 39 runs in match between Samoa Vs Vanuatu
(🎥 – ICC)#T20 #T20WorldCup #records #ICC #CricketUpdate #cricketnews pic.twitter.com/sXiyrlxjtE— SportsOnX (@SportzOnX) August 20, 2024
