NTV Telugu Site icon

Indian-Origin Man: లండన్‌లో భారత సంతతికి చెందిన వ్యక్తి దారుణ హత్య.. మూడు రోజుల్లో రెండో ఘటన

London

London

Indian-Origin Man: యూకేలోని లండన్‌లో చదువుతున్న హైదరాబాద్‌కు చెందిన 27 ఏళ్ల మహిళను బ్రెజిల్ వ్యక్తి కత్తితో పొడిచి చంపిన రెండు రోజుల తరువాత మరో ఘటన శుక్రవారం జరిగింది. శుక్రవారం లండన్‌లో భారతీయ సంతతికి చెందిన వ్యక్తిని కత్తితో పొడిచి చంపాడు. 38 ఏళ్ల భారతీయ సంతతికి చెందిన అరవింద్ శశికుమార్ కత్తి గాయాలతో కనిపించాడని మెట్రోపాలిటన్ పోలీసులు తెలిపారు. శుక్రవారం తెల్లవారుజామున 1.31 గంటలకు బాధితుడు అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. 25 ఏళ్ల సల్మాన్‌ సలీం అనే వ్యక్తి హత్యకు పాల్పడ్డాడని పోలీసులు వెల్లడించారు.

Also read: PM Modi Man Ki Baat: ఎమర్జెన్సీ రోజులు ఇప్పటికీ మనసుకు వెంటాడుతూనే ఉన్నాయి…’మన్ కీ బాత్’లో ప్రధాని మోడీ

అదే రోజున క్రోయ్‌డాన్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరచగా, జూన్ 20న ఓల్డ్ బెయిలీలో హాజరుపరిచేందుకు రిమాండ్ విధించారు. శుక్రవారం నిర్వహించిన పోస్ట్‌మార్టం పరీక్షలో ఛాతీపై కత్తిపోటు కారణంగా శశికుమార్ మృతి చెందినట్లు ఈవినింగ్ స్టాండర్డ్ వార్తాపత్రిక తెలిపింది. కాంబెర్‌వెల్, పెక్‌హామ్‌ల ఎంపీ అయిన హ్యారియెట్ హర్మాన్, మరణాన్ని “భయంకరమైన హత్య”గా అభివర్ణించారు. అతడి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. యూకేలో ఇటీవల కత్తి దాడులు ఎక్కువగా జరుగుతున్నాయి.

Show comments