Site icon NTV Telugu

China Fire Accident: చైనాలో భారీ అగ్ని ప్రమాదం.. 38మంది సజీవ దహనం

China Fire

China Fire

China Fire Accident: సెంట్రల్ చైనాలోని హెనాన్ ప్రావిన్స్‌లోని అన్యాంగ్ నగరంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఓ ఫ్యాక్టరీలో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో 38 మంది కార్మికులు చనిపోయారు. ఈ ప్రమాదంలో పలువురు తీవ్రగాయాల పాలయ్యారు. ఈ ఘటన సోమవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో జరిగింది. క్షతగాత్రులను వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇంతలో అగ్నిప్రమాదం గురించి సమాచారం అందుకున్న స్థానిక అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. 200 మందికి పైగా ఉద్యోగులు మరియు దాదాపు 60 అగ్నిమాపక బృందాలు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి.

Read Also: Hyderabad Traffic: హైదరాబాద్ జనాలకు హై అలర్ట్.. మూడు నెలల పాటు ట్రాఫిక్ మళ్లింపు

మంటలను ఆర్పడానికి అగ్నిమాపక సిబ్బందికి నాలుగు గంటలకు పైగా సమయం పట్టిందని స్థానిక అధికారులు తెలిపారు. రాత్రి 11 గంటల ప్రాంతంలో మంటలు అదుపులోకి వచ్చినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ఈ ప్రమాదానికి కారణమైన వారిని అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఘటనపై స్థానిక పోలీసులు విచారణ ప్రారంభించారు. విచారణ నిమిత్తం పోలీసులు కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ప్రమాద ఘటనపై అధ్యక్షుడు షీ జిన్ పింగ్ స్పందించారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. ప్రమాదానికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలన్నారు.

Exit mobile version