పలు సాంకేతిక కారణాల వల్ల 35 రైళ్లను తాత్కాలికంగా రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. ఖరగ్‌పూర్ డివిజన్‌లోని నారాయణగఢ్ – భద్రక్ మూడో లైన్ పనులకు సంబంధించి రాణిటాల్ రైల్వే స్టేషన్‌లో ఇంటర్‌లాకింగ్ చేయని కారణంగా కొన్ని రైళ్లు రద్దు, మళ్లించబడినట్లు ఓ ప్రకటనలో తెలిపింది దక్షిణ మధ్య రైల్వే శాఖ. ఇదిలా ఉంటే.. ఇప్పటికే.. ఈ నెల 21 నుంచి 23 వరకు పలు రైళ్లు రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు పేర్కొన్నారు.
Also Read : Gannavaram: గన్నవరం ఘర్షణ.. టీడీపీ నేతలపై హత్యాయత్నం, అట్రాసిటీ కేసులు..
వరంగల్ – కాజీపేట(07757), హైద్రాబాద్ – కాజీపేట(07758), సికింద్రాబాద్ – వరంగల్(07462), వరంగల్ – హైద్రాబాద్(07463), విజయవాడ – భద్రాచలం రోడ్(07979), భద్రాచలం రోడ్ – విజయవాడ( 07278), కాజీపేట – డోర్నకల్(07753), డోర్నకల్ – కాజీపేట(07754), డోర్నకల్ – విజయవాడ(07755), విజయవాడ – డోర్నకల్(07756), హైద్రాబాద్ – సిర్పూర్ ఖాగజ్ నగర్(17011), సిర్పూర్ ఖాగజ్ నగర్ – సికింద్రాబాద్(17012) రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షణ మధ్య రైల్వే ముఖ్య ప్రజా సంబంధాల అధికారి రాకేష్ సోమవారం తెలిపారు.