NTV Telugu Site icon

35 Chinna Katha Kaadu : ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ మూవీ ‘35చిన్న కథ కాదు’

New Project (45)

New Project (45)

35 Chinna Katha Kaadu : ఇటీవల కాలంలో చిన్న సినిమాలు పెద్ద విజయాలు సాధిస్తున్నాయి. అలాంటి చిత్రాల్లో ఈ మధ్యే వచ్చిన ‘35 – చిన్న కథ కాదు’ సినిమా ఒకటి. ఈ చిత్రం విమర్శకులు ప్రశంసలు అందుకుంది. నివేదా థామస్ లీడ్ రోల్ చేసిన ఈ ఫ్యామిలీ డ్రామా పై విడుదలకు ముందే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. తక్కువ బడ్జెట్‍తో రూపొందిన ఈ మూవీని హీరో దగ్గుబాటి రానా సమర్పించడం.. ప్రీ-రిలీజ్ ఈవెంట్‍లో నాని ప్రశంసల వర్షం కురిపించడంతో మరింత క్యూరియాసిటీ పెరిగింది. అందుకు తగ్గట్టే 35 – చిన్న కథ కాదు చిత్రం అన్ని విషయాల్లో ఆకట్టుకుంది. సెప్టెంబర్ 6న థియేటర్లలో ఈ చిత్రం రిలీజై సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది. 35 – చిన్న కథ కాదు మూవీకి మంచి స్పందన రావడంతో ఓటీటీలో స్ట్రీమింగ్‍కు ఎప్పుడు వస్తుందా అని చాలా మంది ప్రేక్షకులు ఎదురుచూశారు. వారి ఎదరు చూపులు ఫలించి.. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలోకి అడుగుపెట్టింది. థియేటర్లలో రిలీజైన కొద్ది రోజుల్లోనే స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి వచ్చేసింది.

35 – చిన్న కథ కాదు చిత్రం ఆహా ఓటీటీలో నేడు (అక్టోబర్ 2) స్ట్రీమింగ్‍కు వచ్చేసింది. ఈ మూవీకి పాజిటివ్ రెస్పాన్స్ దక్కడంతో మంచి ధరతో ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ఆహా కొనుక్కుంది. కొన్నిరోజులుగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్‍కు సోషల్ మీడియాలో బాగానే ప్రమోషన్లు నడిచాయి. 35 – చిన్న కథ కాదు చిత్రం హృదయాన్ని తాకేలా ఫీల్‍గుడ్ ఫ్యామిలీ డ్రామా సినిమాలా సాగుతుంది. చదువులో పిల్లలకు తల్లిదండ్రులు మద్దతుగా నిలువడం ఎంత ముఖ్యమో ఈ చిత్రంలో డైరెక్టర్ నంద కిశోర్ ఇమానీ ఆకట్టుకునేలా చెప్పారు. పిల్లల చదువుపై మధ్యతరగతి తల్లిదండ్రులకు ఉండే ఆలోచనలు, వారి కుటుంబ పరిస్థితులు ఇలా చాలా మందికి కనెక్ట్ అయ్యేలా ఈ సినిమా ఉంటుంది. పిల్లల్లో ఉండే సందేహాలను పట్టించుకోవాలనే అంశం కూడా ఉంటుంది. ఒకవేళ థియేటర్లలో ఈ చిత్రాన్ని చూడకపోతే ఆహా ఓటీటీలో మిస్ అవొద్దు.

మధ్యతరగతి తల్లి సరస్వతిగా ఈ మూవీలో నివేదా థామస్ తన అద్భుతమైన నటనతో మెప్పించారు. వకీల్ సాబ్ సినిమా ఈ మూవీతోనే తెలుగులోకి రీ-ఎంట్రీ ఇచ్చారు. మరోసారి తన పర్ఫార్మెన్స్‌తో వావ్ అనిపించారు. ఈ చిత్రంలో విశ్వదేవ్ రాచకొండ, ప్రియదర్శి, అరుణ్ దేవ్, గౌతమి, అభయ్ శంకర్, భాగ్యరాజ్ కీరోల్స్ చేశారు. 35 – చిన్న కథ కాదు చిత్రానికి నంద కిశోర్ దర్శకత్వం వహించారు. కామెడీ, ఎమోషన్లతో హృదయాన్ని తాకేలా సాగుతుంది. ఈ చిత్రాన్ని సృజన్, సిద్ధార్థ్ రాళ్లపల్లి ప్రొడ్యూజ్ చేశారు. సురేశ్ ప్రొడక్షన్స్ పతాకంపై రానా సమర్పించారు. వివేక్ సాగర్ మ్యూజిక్ ఇచ్చిన ఈ మూవీకి నికేత్ బొమ్మి సినిమాటోగ్రఫీ చేశారు.

Show comments