Site icon NTV Telugu

Afghanistan Floods: ఆఫ్ఘనిస్తాన్‌లో భారీ వర్షాలు.. వరదల్లో 33 మంది మృతి

Afghanistan

Afghanistan

Afghanistan Floods: ఆఫ్ఘనిస్తాన్‌లో భారీ వర్షాల కారణంగా వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. మూడు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా దాదాపు 33 మంది ప్రాణాలు కోల్పోగా.. 27 మంది గాయపడ్డారు. దీనిపై తాలిబన్ అధికార ప్రతినిధి ఆదివారం అధికారికంగా సమాచారం ఇచ్చారు. ఆకస్మిక వరదలు రాజధాని కాబూల్‌తో పాటు పలు ప్రావిన్సులను ప్రభావితం చేశాయని రాష్ట్ర ప్రకృతి విపత్తు నిర్వహణ మంత్రిత్వ శాఖ తాలిబన్ ప్రతినిధి అబ్దుల్లా జనన్ సైక్ ఆదివారం తెలిపారు.

Read Also: Producer: సినీ పరిశ్రమలో విషాదం.. ఇంట్లో శవమై కనిపించిన ప్రముఖ నిర్మాత!

600కు పైగా ఇళ్లు దెబ్బతిన్నాయి లేదా ధ్వంసమయ్యాయని, దాదాపు 200 పశువులు చనిపోయాయని ఆయన చెప్పారు. వరదల కారణంగా దాదాపు 800 హెక్టార్ల వ్యవసాయ భూమి, 85 కిలోమీటర్లకు పైగా రోడ్లు దెబ్బతిన్నాయని జనన్ సైక్ తెలిపారు. పశ్చిమ ఫరా, హెరాత్, దక్షిణ జబుల్, కాందహార్ ప్రావిన్సులు ఎక్కువగా దెబ్బతిన్నాయి. ఆఫ్ఘనిస్తాన్‌లోని 34 ప్రావిన్సుల్లో చాలా వరకు రానున్న రోజుల్లో మరింత వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు వాతావరణ శాఖ అంచనాలు వేసింది.

Exit mobile version