NTV Telugu Site icon

Monkey: ఆ గ్రామంలో కోతుల పేరిట 32 ఎకరాల భూమి

New Project (11)

New Project (11)

Monkey: సాధారణంగా వ్యక్తుల పేరుమీద, లేదా సంస్థలు పేరు మీదో భూములుంటాయి. అలాగే దేవుళ్ల పేరుమీద భూములుంటాయి. దేవుళ్ల పేరు మీద ఉన్న భూములను కౌలుకు ఇచ్చి వచ్చే డబ్బులను గ్రామ అభివృద్ధి కోసం ఆయా గ్రామాల్లోని ప్రజలు కేటాయిస్తారు. కానీ ఓ గ్రామంలో మాత్రం కోతుల పేరిట.. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 32ఎకరాల భూమి ఉంది. ఇక్కడ చెప్పుకోదగిన ఇంకో విషయం ఏంటంటే.. నేటి కాలంలో భూమి విలువ ఎంత పెరిగిందో మనందరికీ తెలిసిందే. గజం జాగా కోసం హత్యలు జరిగిన సంఘటనలూ ఉన్నాయి. కానీ ఈ గ్రామంలో ఇంత వరకు ఆ భూమిని ఎవరూ కబ్జా చేయలేదు. వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా.. ఇది నిజం. కాగా.. కోతుల పేరిట ఏ గ్రామంలో భూమి ఉంది? తెలియాలంటే పూర్తి వివరాల్లోకి వెళ్లాల్సిందే..

Read Also: Rajasthan High Court: భార్యను తల్లిని చేసేందుకు 15రోజులు పర్మిషన్ ఇచ్చిన కోర్టు

మహారాష్ట్రంలో ఉస్మానాబాద్ అనే జిల్లా ఉంది. ఈ జిల్లాలోనే ఉపలాఅనే గ్రామం ఉంది. ఇక్కడే కోతులు అధికారిగా 32 ఎకరాల భూమిని కలిగి ఉన్నాయి. రెవెన్యూ రికార్డుల ప్రకారం ఈ గ్రామంలోని 32 ఎకరాలకు కోతులు యజమానులు. ఈ విషయాన్ని ఆ గ్రామ ప్రజలు కూడా ఒప్పుకుంటున్నారు. తాజాగా ఆ గ్రామ సర్పంచ్ బొప్పా పడ్వాల్ మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ‘గ్రామంలోని 32 ఎకరాల భూమి కోతులకు చెందుతుందని డాక్యుమెంట్లలో స్పష్టంగా ఉంది. భూమిని కోతుల పేరిట ఎవరు రాసిచ్చారు. ఎప్పుడు రాసిచ్చారనే విషయం మాత్రం తెలియదు’ అన్నారు. ఆ 32ఎకరాల్లో అటవీ అధికారులు గతంలో పెద్ద మొత్తంలో మొక్కలు నాటినట్టు చెప్పారు.

Read Also: IT Employees: ఆఫీసుకు మేం రామంటున్న ఎంప్లాయీస్.. కలవరపడుతున్న ఐటీ కంపెనీలు

ప్రస్తుతం తమ గ్రామంలో 100 వరకు కోతులు ఉన్నాయని చెప్పారు. గతంలో పోల్చితే వాటి సంఖ్య బాగా తగ్గిందన్నారు. అంతేకాదు.. కొన్నేళ్ల క్రితం వరకూ గ్రామంలో జరిగే ప్రతి వేడుకల్లో కోతులకు పాధాన్యం ఇచ్చినట్టు తెలిపారు. ఎవరి ఇళ్లలో అయినా శుభకార్యం జరిగితే.. వేడుక సందర్భంగా తొలుత అక్కడున్న కోతులకే బహుమానాలు ఇచ్చినట్టు వెల్లడించారు. ప్రస్తుతం ఇటువంటి సంప్రదాయం పాటించనప్పటికీ.. కోతులు ఇంటి వద్దకు వస్తే గ్రామ ప్రజలు వాటికి ఆహారం పెడతారని వివరించారు.