Site icon NTV Telugu

China : కరోనాతో చైనా అతలాకుతలం.. రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు

Corona

Corona

China : ఎవరు తీసుకున్న గోతిలో వారేపడతారన్న సామెత చైనాకు సరిగ్గా సరిపోతుంది. ప్రపంచాన్నే గడగడలాడించిన మహమ్మారిని తయారు చేసిన పాపం ఊరికే పోతుందా.. అందుకే చేసిన తప్పుకు తగిన మూల్యం చెల్లించుకుంటూ వస్తోంది చైనా. అన్ని దేశాలు కరోనా నుంచి బయటపడుతున్నా అక్కడ మాత్రం వైరస్ ఉనికి తగ్గడం లేదు. రోజు రోజుకు ఎక్కడో చోట ఏదో ఒక రూపంలో వైరస్ వారిని వెంటాడుతూనే ఉంది. నిత్యం వేలాది కేసులు వస్తూ అక్కడ జనాలతో ఆస్పత్రులన్నీ కిటకిటలాడుతున్నాయి. తాజాగా చైనా దేశంలో కొత్తగా 31,454 కేసులు రికార్డయ్యాయని నేషనల్‌ హెల్త్‌ బ్యూరో తెలిపింది. ఇందులో 27,517 మందికి ఎలాంటి లక్షణాలు లేవని వెల్లడించింది.

Read Also: Big Breaking : కమల్ హాసన్ కు తీవ్ర అస్వస్థత.. ఆందోళనలో అభిమానులు

కరోనా కేసులు ప్రారంభమైన నాటినుంచి ఒక్కరోజులో ఇంత మంది మహమ్మారి భారిన పడడం ఇదే మొదటిసారని పేర్కొంది. బుధవారం 29,390 కేసులు నమోదైనట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో వైరస్‌ వ్యాప్తిని నిలువరించడానికి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్లు అమలు చేస్తుండగా, ప్రయాణాలపై ఆంక్షలు విధిస్తున్నారు. భారీ సంఖ్యలో పరీక్షలు చేస్తున్నారు. చైనాలో కొన్నిరోజులుగా 20 వేలకుపైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. దీంతో ‘జీరో కరోనా’ విధానం మేరకు మళ్లీ కొత్త ఆంక్షలను అధికారులు ప్రకటించారు. సుమారు ఆరు నెలల తర్వాత ఈ నెల 20న చైనాలో తొలి కరోనా మరణం నమోదైంది. రాజధాని బీజింగ్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 87 ఏళ్ల వృద్ధుడు ఆదివారం మరణించాడు. దీంతో దేశంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 5,227కు చేరింది. ఈ నేపథ్యంలో ఆ దేశ అధికారులు మళ్లీ కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు.

Exit mobile version