NTV Telugu Site icon

Biparjoy Cyclone: ప్రమాదకరంగా మారుతున్న బిపర్ జోయ్ తుఫాన్

Thufan

Thufan

అరేబియా మహాసముద్రంలో బిపర్‌జోయ్‌ తుఫాను భారీ విధ్వంసాన్ని సృష్టించే ప్రమాదముందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ ప్రభావం గుజరాత్‌లోని కచ్, ద్వారక, జామ్‌నగర్‌ జిల్లాలపైనే ఎక్కువగా ఉంటుందని అంచనా వేసింది. బిపర్‌జోయ్‌ మంగళవారం అత్యంత తీవ్ర స్థాయి నుంచి తీవ్రమైన తుపానుగా బలహీనపడిందని ఐఎండీ తెలిపింది. ఇది గుజరాత్‌లోని సౌరాష్ట్ర, కచ్, మాండ్వి, జఖౌ పోర్టులతో పాటు పాకిస్తాన్‌లోని కరాచీ మధ్య ఈ నెల 15 సాయంత్రం తీరాన్ని తాకే అవకాశాలున్నాయని కనిపిస్తుంది. దీని ప్రభావంతో గంటకు 125 నుంచి 150 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని ఐఎండీ పేర్కొంది.

Also Read : Big Breaking: భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ఇంట్లో ఐటీ రైడ్స్.. రంగంలోకి 70 బృందాలు

కచ్, ద్వారక, జామ్‌నగర్, పోరుబందర్‌ జిల్లాల్లో ఈనెల 13– 15 తేదీల మధ్య అత్యంత భారీగా 20 నుంచి 25 సెంటీమీటర్ల మేర కుంభవృష్టి వర్షం కురిసే ఛాన్స్ ఉందని ఐఎండీ తెలిపింది. తీవ్ర ఉధృతితో కూడిన ఈదురు గాలులు, అతి భారీ వర్షాలు కచ్, ద్వారక, జామ్‌నగర్‌ జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాలను వరదలు ముంచెత్తే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ‘రాజ్‌కోట్, మోర్బి, జునాగఢ్‌ల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. ఈ ప్రాంతాల్లో రేపటి వరకు గరిష్టంగా గంటకు 150 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని ఐఎండీ చెప్పింది.

Also Read : 1 Ball 18 Runs: క్రికెట్ చరిత్రలో అత్యంత ఖరీదైన డెలివరీ.. ఒక్క బంతికి 18 పరుగులు! తప్పక చూడాల్సిన వీడియో

ఈ కారణంగా పంటలు, నివాసాలు, రహదారులు, విద్యుత్, సమాచార వ్యవస్థలు దెబ్బతినే అవకాశం ఉంది. సముద్రంలో ఆరు మీటర్ల ఎత్తు వరకు అలలు ఎగిసిపడుతున్నాయి. సముద్రం అల్లకల్లోలంగా ఉన్నందున చమురు అన్వేషణ, నౌకల సంచారం, చేపల వేట వంటివాటిని ఈ నెల 16 వరకు నిలిపివేయాలని వెదర్ డిపార్ట్మెంట్ అధికారులు చెప్పుకొచ్చారు. తీరాన్ని దాటిన తుఫాను బలహీనపడి, తన గమనాన్ని దక్షిణ రాజస్తాన్‌ వైపు మార్చుకుంటుందని సూచించింది. దీని ప్రభావంతో ఈనెల 15–17 తేదీల్లో ఉత్తర గుజరాత్‌లో భారీ వర్షాలకు కురుస్తాయని తెలిపింది.

Also Read : Hyderabad :హైదరాబాద్ లో విషాదం.. కుటుంబంలో నలుగురు మృతి..

బిపర్‌జోయ్‌ ప్రభావిత జిల్లాలకు చెందిన 30 వేల మందిని తాత్కాలిక షెల్టర్లలోకి గుజరాత్‌ ప్రభుత్వం తరలించినట్లు పేర్కొనింది. తుఫాను సంబంధిత ఘటనల్లో ఇప్పటి వరకు ఒకరు చనిపోయినట్లు తెలిపింది. ముందు జాగ్రత్తగా పలు రైళ్లను రద్దు చేశారు. ఇప్పటికే కాండ్లా పోర్టును మూసివేశారు. అక్కడ పనిచేసే 3 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మన్సుఖ్‌ మాండవీయ సహా ఐదుగురు కేంద్ర మంత్రులు సహాయక చర్యలను సమన్వయం చేస్తున్నారు.