సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ పెద్ద ఎత్తున వలసలు టీడీపీలోకి కొనసాగుతున్నాయి. ఇప్పటికే గన్నవరం నియోజకవర్గ వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నారు. గన్నవరంలోని ఓ కల్యాణ మండపంలో జరిగిన ఈ కార్యక్రమంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వనించారు. ఇక, గన్నవరం నియోజకవర్గ నలువైపుల నుంచి దాదాపు 3000 మంది కార్యకర్తలతో పాటు కేసరపల్లి, గన్నవరం, అజ్జంపూడి, చిక్కవరం, పెద్ద ఆవుటపల్లి, ఆరుగొలను, కానుమోలు, హనుమాన్ జంక్షన్, చిరివాడ, పెరికీడు, తదితర గ్రామాల నుంచి పెద్ద ఎత్తున ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందినవారు టీడీపీలో చేరారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు భారీ మోజార్టీతో గెలవటం ఖాయమన్నారు.
Read Also: Anand Deverakonda : గం.. గం…గణేశా నుండి స్పెషల్ అప్డేట్ అందించిన ఆనంద్ దేవరకొండ..
అయితే, సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో గన్నవరం నియోజకవర్గం టీడీపీ- జనసేన- బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్ధి యార్లగడ్డ వెంకట్రావు ఎన్నికల ప్రచారంలో వేగం పెంచారు. బాపులపాడు మండలంలోరి అంపాపురం, కోడూరుపాడు పంచాయితీకి చెందిన ఉమామహేశ్వరపురం గ్రామాల్లో శనివారం నాడు యార్లగడ్డ, ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా యార్లగడ్డ వెంకట్రావ్ మాట్లాడుతూ.. ప్రజలను దోచుకోవటానికి, వేధించటానికి తాను రాజకీయాల్లోకి రాలేదని.. ప్రజలకు మేలు చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చానని స్పష్టం చేశారు. తనకు ఒక అవకాశం ఇచ్చి గన్నవరం ఎమ్మెల్యే గెలిపిస్తే.. అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తానని పేర్కొన్నారు. నియోజకవర్గంలోని అందరకి సురక్షిత తాగునీటిని అందించడం తన కర్తవ్యం అన్నారు. అలాగే, రాష్ట్రాన్ని అభివృద్ది చేసే సత్తా కేవలం చంద్రబాబు నాయుడుకి మాత్రమే ఉందన్నారు. రానున్న ఎన్నికల్లో గన్నవరం నియోజకవర్గానికి సైకిల్ గుర్తుపై ఓటు వేసి తనకు, బందరు పార్లమెంట్ అభ్యర్థి వల్లభనేని బాలశౌరికి ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని యార్లగడ్డ వెంకట్రావ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Read Also: Pemmasani: టీడీపీలోకి 350 మంది నేతలు.. పార్టీలోకి ఆహ్వానించిన పెమ్మసాని
ఇక, టీడీపీ- జనసేన- బీజేపీ కూటమి తరపున బందరు ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి మాట్లాడుతూ.. మచిలీపట్నం పోర్ట్ అభివృద్ధికి కేంద్రం నుంచి నిధులు తెచ్చి పనులు ప్రారంభించినట్లు తెలిపారు. పోర్టుల వల్లే మద్రాస్, వైజాగ్ లు అభివృద్ధి చెందాయన్నారు. బందరు పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గాల్లో అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు. అంపాపురంలో చెరువును బాగు చేసి తాగునీటిని అందిస్తాం, మల్లవల్లిలో పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. 15 రోజులు నాయకులు, కార్యకర్తలు కష్టపడి పనిచేస్తే కుటమి అభ్యర్థులు భారీ మెజార్టీతో విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని వల్లభనేని బాలశౌరి ధీమా వ్యక్తం చేశారు.