Site icon NTV Telugu

Vijayawada Fire Accident: విజయవాడలో భారీ అగ్ని ప్రమాదం.. 300 ద్విచక్ర వాహనాలు దగ్ధం!

Vijayawada Tvs Showroom

Vijayawada Tvs Showroom

Fire Broke Out in Vijayawada TVS Showroom: విజయవాడలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. గురువారం తెల్లవారుజామున కేపీ నగర్‌ ప్రాంతంలో ఉన్న టీవీఎస్‌ వాహనాల షోరూంలో భారీ మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో షోరూమ్‌తో పాటు గోదాంలో ఉన్న దాదాపు మూడు వందల ద్విచక్ర వాహనాలు దగ్ధమైనట్లు తెలుస్తోంది. ఇందులో ఎలక్ట్రిక్‌ వాహనాలు కూడా ఉన్నాయి. మూడు ఫైరింజన్లు గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.

విజయవాడలోని చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారిపై స్టెల్లా కాలేజీ సమీపంలో టీవీఎస్‌ షోరూం ఉంది. ఈరోజు తెల్లవారుజామున షోరూంలోని మొదటి అంతస్తులో షార్ట్‌ సర్క్యూట్‌ జరిగి భారీ స్థాయిలో మంటలు చెలరేగాయి. కొద్ది సమయంలోనే ఆ మంటలు గోదాంకూ విస్తరించాయి. ఇది గమనించిన సెక్యూరిటీ.. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. మూడు ఫైరింజన్లు ఘటనాస్థలానికి చేరుకుని మంటలు అదుపులోకి తీసుకొచ్చాయి. ప్రీఫ్యాబ్రిక్‌ పద్ధతిలో నిర్మించిన షోరూం కావడంతో మంటలు వేగంగా విస్తరించాయని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. గోదాంలో సాధారణ టూ వీలర్లతో పాటు ఎలక్ట్రిక్‌ వాహనాలు కూడా పెద్ద సంఖ్యలో ఉండటంతో మంటలు భారీగా ఎగిసిపడ్డాయని పేర్కొన్నారు.

Also Read: Harry Brook Catch: క్రికెట్ చరిత్రలోనే కనీవినీ ఎరుగని క్యాచ్.. బ్రూక్ క్యాచ్ పట్టినా మరొకరి ఖాతాలో క్రెడిట్!

పోలీసులు టీవీఎస్‌ షోరూం చేరుకుని విచారణ చేపట్టారు. పెట్రోల్‌ వాహనాలను ఉంచే గోదాం సమీపంలోనే ఎలక్ట్రిక్‌ వాహనాలను కూడా ఉంచడం, వాటిని ఛార్జింగ్‌ పెట్టడం వల్ల ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. విజయవాడ సహా ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన టీవీఎస్‌ వాహనాలకు ఇదే ప్రధాన కార్యాలయం. దాంతో వందల సంఖ్యలో వాహనాలు ఇక్కడే ఉంచుతారు. షోరూంతో పాటు సర్వీస్‌ సెంటర్‌‌లను కూడా ఇక్కడే నిర్వహిస్తున్నారు. ఒకే ప్రాంగణంలో షోరూం, గోదాం, సర్వీస్‌ సెంటర్‌ ఉండటంతో వందల సంఖ్యలో వాహనాలు ఉన్నాయి. ప్రమాదం కారణంగా భారీగా ఆస్తి నష్టం సంభవించింది.

Exit mobile version