Site icon NTV Telugu

Brain Dead: 30 ఏళ్ల వ్యక్తి బ్రెయిన్ డెడ్.. అవయవదానం చేసిన కుటుంబం

New Project (15)

New Project (15)

Brain Dead : హైదరాబాదుకు చెందిన 30 ఏళ్ల కార్మికుడు బ్రెయిన్ డెడ్ అయినట్టు వైద్యులు డిక్లేర్ చేశారు. కుటుంబ సభ్యులు ఆ వ్యక్తి అవయవాలను దానం చేశారు. జీవన్‌దాన్ ఆర్గాన్ డొనేషన్ ఇనీషియేటివ్ ద్వారా ఈ అవయవదానం జరిగింది. ముషీరాబాద్‌లో జవహర్ నగర్‌లో 30 ఏళ్ల పోటకారి రాజేశ్ నివసిస్తుండేవాడు. ఏప్రిల్ 12వ తేదీన ఆయనకు ఒంట్లో నలతగా అనిపించింది. ఆ తర్వాత ఇంటిలోనే అస్వస్థకు గురై కుప్పకూలాడు. కుటుంబ సభ్యులు రాజేశ్‌ను ఎల్బీ నగర్‌లోని కామినేని హాస్పిటల్స్‌కు తీసుకెళ్లారు.

Read Also: Sudan: సూడాన్ ఘర్షణల్లో 61 మంది మృతి.. మృతుల్లో కేరళ వాసి

అక్కడ రాజేశ్‌కు 72 గంటలపాటు క్రిటికల్ ఇంటెన్సివ్ కేర్ లో ఉంచి చికిత్స అందించారు. కానీ, రాజేశ్ ఆరోగ్యంలో మాత్రం మెరుగుదల కనిపించలేదు. ఏప్రిల్ 15న రాజేశ్ బ్రెయిన్ డెడ్ అయినట్టు మెదడు పరీక్ష చేసిన డాక్టర్లు ప్రకటించారు. హాస్పిటల్ సిబ్బంది, జీవన్‌దాన్ కోఆర్డినేటర్లు కలిసి రాజేశ్ కుటుంబ సభ్యులుకు పలుమార్లు అవయవదానంపై కౌన్సెలింగ్ ఇచ్చారు. అనంతరం, అవయవదానం చేయడానికి రాజేశ్ కుటుంబం అంగీకరించింది. రాజేశ్ అవయవాలను దానం చేయడానికి ఆయన భార్య పోటకారి శాలిని, తండ్రి పోటకారి మోసెస్, ఆయన తల్లి సమ్మతించారు. సర్జన్లు రాజేశ్ బాడీ నుంచి రెండు కిడ్నీలను, కార్నియాలను సేకరించారు. ఆర్గాన్ డొనేషన్ గైడ్‌లైన్స్ ప్రకారం ఆ అవయవాలను అవసరార్థులకు కేటాయించామని తెలిపారు.

Exit mobile version