Site icon NTV Telugu

Indian Army: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ముగ్గురు సైనికులు మృతి

Army

Army

జమ్మూ కాశ్మీర్‌లోని రాంబన్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. భారత ఆర్మీ వాహనం లోయలో పడిపోయింది. 700 అడుగుల లోతైన లోయలో ఆర్మీ కాన్వాయ్ లోని వాహనం పడింది. జమ్ము నుంచి శ్రీనగర్ వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు సైనికులు మృతిచెందారు. మరణించిన సైనికులను అమిత్ కుమార్, సుజీత్ కుమార్, మాన్ బహదూర్ గా గుర్తించినట్లు వార్తా సంస్థ పిటిఐ తెలిపింది.

Also Read:Virat Kohli: కోహ్లీ ఖాతాలో మరో రికార్డు.. ‘గోట్’ ఆఫ్ ఐపీఎల్‌!

700 అడుగుల లోతైన లోయలో వాహనం పడిపోవడంతో వాహనం నుజ్జు నుజ్జైంది. సైనికుల మృతదేహాలు, వారి వస్తువులు, కొన్ని కాగితాలు ప్రమాద స్థలంలో చెల్లాచెదురుగా పడిపోయాయి. ప్రమాద సమాచారం తెలుసుకున్న భారత సైన్యం, జమ్మూ కాశ్మీర్ పోలీసులు, రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (SDRF), స్థానిక స్వచ్ఛంద సేవకులు సహాయక చర్యలను ప్రారంభించారు.

Exit mobile version