Site icon NTV Telugu

Bus Crashes Tree: చెట్టును ఢీకొట్టిన పెళ్లి బస్సు.. ముగ్గురు మృతి, 50 మందికి గాయాలు

Bus Accident

Bus Accident

Bus Crashes Tree: మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సింగ్‌రౌలీ జిల్లాలో పెళ్లి బృందం సభ్యులతో నిండిన బస్సు చెట్టును ఢీకొనడంతో ముగ్గురు వ్యక్తులు మరణించగా, దాదాపు 50 మంది గాయపడినట్లు పోలీసులు తెలిపారు. గాయపడిన వారిలో 11 మంది పరిస్థితి తీవ్రంగా ఉందని వారు వెల్లడించారు. అకస్మాత్తుగా ఎదురుగా వచ్చిన మోటార్‌బైక్‌ను ఢీకొట్టకుండా ఉండేందుకు బస్సు డ్రైవర్ చక్రాలపై నియంత్రణ కోల్పోయాడని ప్రాథమిక విచారణలో సూచించినట్లు మాడా పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ కపూర్ త్రిపాఠి తెలిపారు.

Clash With Cops: అమృత్‌సర్‌లో తీవ్ర ఉద్రిక్తత.. తుపాకులు, కత్తులతో పోలీస్‌స్టేషన్‌ ముట్టడి

వధువుతో పాటు వరుడి తరపు సభ్యులతో వెళ్తున్న బస్సు జిల్లా కేంద్రానికి 60 కిలోమీటర్ల దూరంలోని ధారి గ్రామం వద్ద రోడ్డు పక్కన చెట్టును ఢీకొట్టింది. వివాహం ముగించుకుని ఇంటికి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. మాణిక్ కేస్ బియార్ (45), ఉమర్ కేస్ బింద్ (35), భాయ్ లాల్ బియార్ (50) అనే ముగ్గురు వ్యక్తులు – ముందు వరుసలో కూర్చున్న వారు అక్కడికక్కడే మరణించారని అధికారి తెలిపారు. గాయపడిన వారిని జిల్లా ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.

Exit mobile version