Site icon NTV Telugu

US firing: నైట్‌క్లబ్ దగ్గర కాల్పులు.. ముగ్గురు మృతి

Usfiring

Usfiring

అగ్ర రాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులతో దద్దరిల్లింది. ఓ నైట్‌క్లబ్ దగ్గర దుండగుడు జరిపిన కాల్పుల్లో ముగ్గురు మరణించగా.. మరో 13 మంది గాయపడ్డారు. సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత చర్చి స్ట్రీట్‌లో ఉన్న నైట్‌క్లబ్ దగ్గర కాల్పులు జరిగాయి. మృతుల్లో ముగ్గురు కూడా 19 ఏళ్ల యువకులేనని మిస్సిస్సిప్పి మేయర్ కెన్ ఫెదర్‌స్టోన్ ధృవీకరించారు. మొత్తం 16 మందిపై కాల్పులు జరిపినట్లుగా పేర్కొన్నారు. ఇందులో ముగ్గురు చనిపోగా.. మరో 13 మంది ఆస్పత్రిలో కోలుకుంటున్నారు. ఇప్పటి వరకు ఎవర్నీ అరెస్ట్ చేయలేదు. విచారణ కొనసాగుతోంది. అసలు నిందితుడు కాల్పులు ఎందుకు చేశాడో తెలియలేదు.

ఇది కూడా చదవండి: Alleti Maheshwar Reddy : సీఎం అసెంబ్లీలో మాట్లాడాలంటే ఎందుకు జంకుతున్నారు

Exit mobile version