Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story 27 Killed In Gold Mine Fire Tragedy In Peru

Gold Mine Fire: బంగారు గనిలో అగ్ని ప్రమాదం.. 27 మంది మృతి

Published Date :May 8, 2023 , 7:29 am
By Mahesh Jakki
Gold Mine Fire: బంగారు గనిలో అగ్ని ప్రమాదం.. 27 మంది మృతి
  • Follow Us :
  • google news
  • dailyhunt

Gold Mine Fire: దక్షిణ పెరూలోని మారుమూల ప్రాంతంలోని బంగారు గనిలో జరిగిన అగ్ని ప్రమాదంలో కనీసం 27 మంది కార్మికులు మరణించారని అధికారులు ఆదివారం తెలిపారు. ఇది దేశ ఇటీవలి చరిత్రలో అత్యంత ఘోరమైన మైనింగ్ విషాదాలలో ఒకటిగా నిలిచింది. దుఃఖంలో మునిగిన బంధువులు తమ ప్రియమైనవారి వార్తల కోసం గని దగ్గర గుమిగూడారు. పెరూకు దక్షిణంగా ఉన్న అరేక్విపా డిపార్ట్‌మెంట్‌లో ఉన్న యానాక్విహువా గనిలో శనివారం తెల్లవారుజామున ఈ సంఘటన జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయని అరేక్విపా స్థానిక ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. గోల్డ్ మైనింగ్ సైట్‌కు దగ్గరగా ఉన్న చెక్క బ్లాకుల ద్వారా మంటలు త్వరగా వ్యాపించాయని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో 27 మంది కార్మికులు ఊపిరాడక మరణించారు. ఆ మరణాల్ని ఆ దేశ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ధృవీకరించింది.

అరేక్విపా ప్రాంతంలోని లా ఎస్పెరాంజా 1 గనిలోని సొరంగంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం సంభవించినట్లు పోలీసులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ కార్యాలయం ధృవీకరించింది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ జియోవన్నీ మాటోస్ మాట్లాడుతూ.. “గనిలో 27 మంది చనిపోయారు” అని చెప్పారు. ప్రాంతీయ రాజధాని అరేక్విపా నగరం నుంచి 10 గంటల ప్రయాణంలో రిమోట్ కాండెసుయోస్ ప్రావిన్స్‌లోని గనిలో పేలుడు సంభవించిన తర్వాత మంటలు ప్రారంభమైనట్లు స్థానిక మీడియా ముందుగా తెలిపింది. బాధితులు భూమికి 100 మీటర్ల దిగువన ఉన్నారని స్థానిక మీడియా తెలిపింది. బాధితుల మృతదేహాలను బయటకు తీయడానికి రెస్క్యూ బృందాలు ప్రయత్నిస్తున్నాయి. మంటలు చెలరేగిన సమయంలో గనిలో ఎంత మంది ఉన్నారనే దాని గురించి ఎటువంటి నిర్ధారణ లేదు. ప్రాణాలతో బయటపడినట్లు ఎటువంటి నివేదికలు లేవు. బంధువుల సమాచారం కోసం కుటుంబ సభ్యులు సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. లాటిన్ అమెరికాలో అతిపెద్ద బంగారు ఉత్పత్తిదారు అయిన పెరూలో రెండు దశాబ్దాలకు పైగా జరిగిన ఘోరమైన మైనింగ్ ప్రమాదం ఇది.

Read Also: Boat Accident: విషాదం.. బీచ్‌ వద్ద పడవ బోల్తా.. 21 మంది దుర్మరణం

మినేరా యాంక్విహువా అనే సంస్థ ద్వారా నిర్వహించబడుతున్న ఈ గని చట్టపరమైన సంస్థ అయితే ఈ ప్రాంతంలో చాలా అక్రమ గనులు ఉన్నాయి. కంపెనీ 23 ఏళ్లుగా పెరూలో గనులను నిర్వహిస్తోంది. అయితే ఈ ఘటనపై కంపెనీ ఇంకా స్పందించలేదు. పెరూ ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉన్న బంగారు ఉత్పత్తిదారు మరియు రెండవ అతిపెద్ద రాగి ఉత్పత్తిదారు. పెరువియన్ ఆర్థిక వ్యవస్థలో మైనింగ్ ప్రధానంగా ఉంది. ఇది జీడీపీలో ఎనిమిది శాతం కంటే ఎక్కువ. మైనింగ్, ఇంధన మంత్రిత్వ శాఖ ప్రకారం.. గత సంవత్సరం, మైనింగ్ సంబంధిత సంఘటనలలో 39 మంది మరణించారు. కానీ 2020లో, అరేక్విపాలో గని కూలిపోవడంతో నలుగురు మైనర్లు చిక్కుకుని మరణించారు. ప్రపంచంలోనే అతిపెద్ద బంగారు గనులు పెరూలో ఉన్నాయి. ఏటా వీటి నుంచి 100 టన్నుల బంగారాన్ని వెలికితీస్తుంటుంది. ప్రపంచంలోని బంగారం ఉత్పత్తిలో ఇది 4శాతం ఇక్కడి నుంచే లభ్యమవుతుంది. అధికారిక మూలాల ప్రకారం వెండి, రాగి, జింక్ ఉత్పత్తిలో పెరూ ప్రపంచంలో రెండవ అతిపెద్ద దేశంగా ఉంది. .

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • fire accident
  • Gold Mine Fire
  • gold mine fire tragedy
  • mining tragedy
  • Peru

తాజావార్తలు

  • YS Jagan: అమరావతి అవినీతి గని.. MAVIGUN ప్రణాళికే బెస్ట్‌..!

  • Shouryuv: ఆ ఒక్క కారణంతోనే మృణాల్‌ని ఫిక్స్ చేశా.. డైరెక్టర్ శౌర్యువ్ మాటలకు నాని షాక్!

  • Lenin vs Peddi : ‘లెనిన్’ దిగుతున్నాడు.. ‘పెద్ది’ పరిస్థితేంటి? 

  • ACB: రిటైర్డ్ కాబోయే ఉపాధ్యాయుడి నుంచి లంచం తీసుకుంటూ.. ఏసీబీకి చిక్కిన హెడ్మాస్టర్

  • Tesla Struggles in India: భారత్‌లో టెస్లా ఆపసోపాలు.. 7 నెలల్లో కేవలం 342 కార్లే విక్రయం.. దుమ్మురేపుతున్న ఇతర EV కార్లు..!

ట్రెండింగ్‌

  • Vellulli Karam Recipe: వేడివేడి అన్నంలో నెయ్యితో ‘వెల్లుల్లి కారం’ కలిపి తింటే.. ఆ రుచే వేరప్ప..!

  • Vitamin B12 Rich Soups: విటమిన్ B12 లోపం..? ఈ సూప్‌లు తాగితే నరాలు మళ్లీ యాక్టివ్.!

  • Fatty Liver: ఇక ఫ్యాటీ లివర్ సమస్యకు చెక్.. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడే 5 అద్భుత సూత్రాలు..!

  • 144Hz రిఫ్రెష్ రేట్, 7000mAh “టైటాన్ బ్యాటరీ”తో భారత్‌లో Realme NARZO 100 Lite 5G లాంచ్..!

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions