Site icon NTV Telugu

World’s Oldest Cat: 26 ఏళ్ల ఫ్లాస్సీ.. ప్రపంచంలోనే అత్యంత వృద్ధ పిల్లిగా రికార్డు

Oldest Cat

Oldest Cat

World’s Oldest Cat: 1995లో జన్మించిన ఫ్లాస్సీని ప్రపంచంలోనే అత్యంత వృద్ధ పిల్లిగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అధికారికంగా గుర్తించింది. ఒక పిల్లి 26 ఏళ్లు బతకడం అంటే దాదాపు మనిషి 120 సంవత్సరాలు బతకడంతో సమానమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. నవంబర్ 10న 26 సంవత్సరాల 316 రోజులతో రికార్డ్ బుక్‌లలోకి ప్రవేశించింది. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ క్యాట్స్ ప్రొటెక్షన్ స్వచ్ఛంద సంస్థతో కలిసి ఈ రికార్డును ప్రదానం చేసింది. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ (జీడబ్ల్యుఆర్) విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం, పెంపుడు జంతువు బాగా ఆరోగ్యంగా ఉంది. కానీ చూపు సరిగా లేకపోవడంతో పాటు చెవిటిది కూడా అని తెలిసింది. 26 ఏళ్ల 329 రోజుల వ‌య‌సు ఉన్న ఈ పిల్లి మ‌రికొద్ది రోజుల్లో 27వ పుట్టిన రోజు జ‌రుపుకోనుంది. గిన్నిస్ రికార్డు సాధించిన ఈ పిల్లి పేరు ఫ్లాస్సీ. ఈ పిల్లి ఫొటోల్ని గిన్నిస్ సంస్థ ట్విట్టర్ ఖాతాలో పెట్టింది. దాంతో ఫ్లాస్సీ ఫొటోలు ఆన్‌లైన్‌లో వైర‌ల్ అవుతున్నాయి.

Bombay High Court: విడాకుల కోసం భార్యకు హెచ్ఐవీ ఉందని అబద్ధం.. కోర్టు ఏం చేసిందంటే.?

1995లో మెర్సీసైడ్‌ ఆస్పత్రి ప‌రిస‌రాల్లో క‌నిపించిన ఫ్లోసీను ఒక వ‌ర్కర్ పెంచుకునేందుకు ఇంటికి తీసుకెళ్లాడు. ప‌దేళ్ల త‌ర్వాత అత‌ను చ‌నిపోవ‌డంతో అత‌ని చెల్లెలు ఫ్లాస్సీ బాధ్యత తీసుకుంది. అలా ఇప్పటివ‌ర‌కూ చాలామంది య‌జ‌మానుల ద‌గ్గర పెరిగింది. గోధుమ‌, న‌లుపు రంగులో ఉన్న ఫ్లోసీని ప్రస్తుతం బ్రిట‌న్‌కు చెందిన విక్కీ గ్రీన్‌ అనే వ్యక్తి పెంచుకుంటున్నాడు. ఫ్లాస్సీ 26 ఏళ్ల వ‌య‌సులోనూ చ‌లాకీగా ఉంటుంద‌ని, చ‌క్కగా ఆడుకుంటుంద‌ని విక్కీ తెలిపాడు. అంతేకాదు పూర్తి ఆరోగ్యంగా ఉంద‌ని కాక‌పోతే చూపు, వినికిడి శ‌క్తి త‌గ్గాయ‌ని చెప్పాడు. ఇంత‌కుముందు ఈ రికార్డు అమెరికాకు చెందిన టిఫానీ టూ అనే పిల్లి పేరు మీద ఉండేది.

Exit mobile version