NTV Telugu Site icon

26/11 Mumbai Attack: త్వరలో భారత్‌కు.. 26/11 ముంబై దాడిలో ప్రమేయం ఉన్న ఉగ్రవాది!

Tahavvoor Rana

Tahavvoor Rana

26/11 ముంబై ఉగ్ర దాడుల్లో ప్రమేయం ఉన్న పాకిస్థానీ సంతతికి చెందిన కెనడా వ్యాపారవేత్త తహవ్వూర్‌ రాణాను త్వరలో భారత్‌కు అప్పగించవచ్చు. రాణాను భారత్‌కు తీసుకొచ్చే ప్రక్రియ దౌత్య మార్గాల్లో సాగుతోంది. 2024 ఆగస్ట్‌లో.. రెండు దేశాల మధ్య ఉన్న అప్పగింత ఒప్పందం ప్రకారం.. రాణాను భారత్‌కు అప్పగించవచ్చని యూఎస్ కోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి రెండు దేశాల మధ్య ఈ అంశంపై చర్చలు కొనసాగుతున్నాయి. మరి కొన్ని రోజుల్లోనే భారత్‌కు తీసుకొచ్చి.. ఉరిశిక్ష విధించే అవకాశం ఉంది.

READ MORE: Rewind 2024 : బాలీవుడ్‌ ‘ఖాన్‌’ల ప్రభావం తగ్గుతోంది.. ఇదే సాక్ష్యం

కాగా.. 2008 ముంబై 26/11 ఉగ్రదాడుల్లో నిందితుడిగా ఉన్న ఉగ్రవాది, పాకిస్థాన్ కెనడియన్ అయిన తహవ్వూర్ రాణా అమెరికా సుప్రీంకోర్టుని ఇటీవల ఆశ్రయించాడు. భారత్‌కి తనను అప్పగించే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీం తలుపు తట్టాడు. కింది కోర్టులు రాణాని భారత్‌కి అప్పగించాలని తీర్పు చెప్పాయి. ముంబై ఉగ్రదాడిలో రాణా ప్రమేయం ఉందని, అతడిని తమకు అప్పగించాలని భారత్ అమెరికాని కోరింది. దిగువ కోర్టులు, అనేక ఫెడరల్ కోర్టులలో జరిగిన న్యాయ పోరాటంలో ఓడిపోయిన తర్వాత రానా చివరిసారిగా శాన్ ఫ్రాన్సిస్కోలోని నార్త్ సర్క్యూట్ కోసం యూఎస్ కోర్ట్ ఆఫ్ అప్పీల్‌కు చేరుకున్నాడు. అయితే కోర్టు రాణా పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. అప్పగింత ఉత్తర్వులు సరైనవేనని పేర్కొంది. రాణాకు వ్యతిరేకంగా భారత్ తగిన సాక్ష్యాలను సమర్పించిందని కోర్టు తెలిపింది.

READ MORE: SSMB 29 : రేపు రాజమౌళి- మహేశ్ సినిమా పూజా కార్యక్రమం

ఇదిలా ఉండగా… రాణా 26/11 ముంబై ఉగ్రదాడిలో కీలక పాత్ర పోషించాడు. పాకిస్తాన్-అమెరికన్, లష్కరే తోయిబా(ఎల్ఈటీ) ఉగ్రవాది డేవిడ్ కోల్‌మన్ హెడ్లీతో రాణాకి సంబంధాలు ఉన్నాయి. 10 మంది పాకిస్థానీ ఉగ్రవాదులు 60 గంటల పాటు ముంబై నగరంలో నరమేధం సృష్టించారు. ఈ దాడిలో 166 మంది మరణించారు. మరణించిన వారిలో ఆరుగురు అమెరికన్లు కూడా ఉన్నారు. ఈ దాడిలో అజ్మల్ కసబ్ మినహా అందరు ఉగ్రవాదుల్ని భద్రతా బలగాలు హతమార్చాయి. కసబ్‌ని మన దేశ న్యాయస్థానాల తీర్పు మేరకు ఉరితీసి శిక్ష అమలు చేశారు.

Show comments