ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని నేషనల్ పార్క్ అడవి ప్రాంతాన్ని 25,000 మంది కేంద్ర భద్రత బలగాలు ముట్టడి చేశాయని సమాచారం నేషనల్ పార్క్ ఏరియాలో మావోయిస్టు పార్టీ అగ్రనేత మాడవి హిడ్మ, దేవా ను లక్ష్యంగా చేసుకొని బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నారని సమాచారం అందుతుంది. కగార్ పేరుతో ఇప్పటికీ జనవరి ఒకటి నుంచి 560 మందిని ఎన్కౌంటర్ పేరా కాల్చి చంపి రాజ్యాంగ ఉల్లంఘనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పాల్పడుతున్నాయి. 25వేల మంది కేంద్ర బలగాలు వెంటనే వెనక్కి రావాలని పౌర హక్కుల సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తుంది.
Read Also: Falcon App Scam: ఏం స్కెచ్చేశారు మామ.. చిన్న యాప్‌తో 4 వేల కోట్ల రూపాయలు కొట్టేశారుగా!
మావోయిస్టులు సజీవంగా పట్టుబడి ఉంటే వెంటనే కోర్టులో హాజరుపరచాలని పౌర హక్కుల సంఘం డిమాండ్ చేస్తుంది. మాడవి హిడ్మా,దేవలను లక్ష్యంగా చేసుకుని కేంద్ర బలగాలు అడవిన్ని చుట్టుముట్టడాన్ని పౌర హక్కుల సంఘం తీవ్రంగా ఖండిస్తుంది. రాజ్యాంగ హక్కులను ఉల్లంఘిస్తూ పెసా, అడవి, చట్టాలను కాల రాస్తుంది. ఎవరైనా మావోయిస్టు పట్టుబడి ఉంటే వెంటనే కోర్టులో హాజరు పరచాలి. వారికి ఎలాంటి ప్రాణహాని తలపెట్టవద్దని పౌర హక్కుల సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తుంది.
