NTV Telugu Site icon

Srisailam Temple: శ్రీశైలం ఆలయం గుడ్‌న్యూస్‌.. తెల్లరేషన్ కార్డు ఉన్న భక్తులకు మాత్రమే..

Srisailam

Srisailam

Srisailam Temple: ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలం ఆలయం భక్తులకు శుభవార్త చెప్పింది.. తెల్లరేషన్ కార్డు ఉన్న భక్తులకు మాత్రమే ఇది వర్తింపజేయనున్నారు.. తెల్లరేషన్‌ కార్డు ఉన్న భక్తులు నెలలో ఒకరోజు ఉచిత సామూహిక సేవలు ప్రవేశపెట్టింది శ్రీశైలం దేవస్థానం.. అరుద్రోత్సవం సందర్భంగా తెల్లరేషన్ కార్డు భక్తులకు ఉచిత సామూహికసేవగా శ్రీస్వామిఅమ్మవారి కళ్యాణం నిర్వహించారు. చంద్రవతి కళ్యాణ మండపంలో శ్రీస్వామి అమ్మవారి కల్యాణానికి 250 మంది తెల్లరేషన్ కార్డు భక్తులు పాల్గొన్నారు. ఇక, కళ్యాణం అనంతరం భక్తులను శ్రీస్వామి అమ్మవారి దర్శనానికి అనుమతించారు దేవస్థానం అధికారులు.. కాగా, శ్రీశైలం క్షేత్రం నిత్యం భక్తులతో రద్దీగా ఉంటుంది.. కార్తీక మాసంలో పెద్ద సంఖ్యలో మల్లన్న దర్శనానికి తరలివస్తుంటారు భక్తులు.. ఇక, ఉగాది బ్రహ్మోత్సవాలు, శివరాత్రి బ్రహ్మోత్సవాల సమయంలో శ్రీశైలం భక్తులతో కిటకిటలాడుతుంటుంది. మొత్తంగా ఇప్పుడు తెల్ల రేషన్‌ కార్డు ఉన్న భక్తులకు శ్రీశైలం మల్లన్న ఆలయం అధికారులు శుభవార్త చెప్పారు.

Read Also: OLA: ‘ఓలా’ యాప్‌లో కొత్త ఫీచర్‌.. ఇక పేమెంట్స్‌..!