రోజురోజుకు మహిళలపై లైంగిక వేధింపులు ఎక్కువైపోతున్నాయి. పిల్లలపై కూడా అఘాయిత్యాలకు ఒడిగడుతున్నారు కొందరు దుండగులు. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం వెలుగుచూసింది. 12 ఏళ్ల బాలికపై పాతికేళ్ల కామాంధుడు దారుణానికి ఒడిగట్టాడు. ఈ ఘటన అశ్వరావుపేట మండలం ఊట్లపల్లిలో చోటుచేసుకుంది. బాలిక అనారోగ్యంతో ఉండటంతో హాస్పిటల్ కి తీసుకెళ్లగా.. బాలిక ఐదో నెల గర్భవతి అని వైద్యులు తేల్చారు. స్థానికులు చైల్డ్ డెవలప్మెంట్ శాఖకు సమాచారం అందించారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Bhadradri Kothagudem: 12 ఏళ్ల బాలికపై పాతికేళ్ల కామాంధుడి దురాగతం.. ఐదో నెల గర్భవతి అని తేల్చిన వైద్యులు
- 12 ఏళ్ల బాలికపై పాతికేళ్ల కామాంధుడి దురాగతం
- బాలిక అనారోగ్యంతో ఉండటంతో హాస్పిటల్ కి
- ఐదో నెల గర్భవతి అని తేల్చిన వైద్యులు

Harassment