వయసులో ఉన్న యువతి, యువకుడు పెళ్లి చేసుకుని సంసారం చెయ్యడం సర్వసాధారణం. వివాహం చేసుకున్న తరువాత దంపతుల మధ్య గొడవలు రావడం, విడిపోవడం ప్రతిరోజు జరుగుతున్నాయి. అయితే ఇక్కడ భలే గమ్మత్తు అయిన విషయం వెలుగు చూసింది. 40 ఏళ్ల ఆంటీని ఓ పాతికేళ్ల యువకుడు పెళ్లి చేసుకున్నాడు. మనస్పర్థక కారణంగా ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు.
READ MORE: Vishnupriya : చీరకట్టులో నడుము అందాలు చూపిస్తున్న విష్ణుప్రియ
అసలు విషయం ఏంటంటే?
విశాఖపట్నానికి చెందిన పద్మ(40) ఓ యువకుడి ప్రేమలో పడింది. ఆమెకు మెడికల్ రిప్రజెంటేటివ్‌గా పనిచేసే కొడుకు, డిగ్రీ ఫైనలియర్ చదువుతున్న కూతురు ఉన్నారు. కానీ సోషల్ మీడియా పద్మను ముంచేసింది. ఇన్‌స్టాగ్రామ్ లో ఏడాది కిందట శ్రీకాళహస్తిలోని కైలాసగిరి కాలనీకి పాతికేళ్ల సురేష్ పరిచయమయ్యాడు.. సురేష్ ఓ మొబైల్ దుకాణంలో పని చేసేవాడు. ఇద్దరి పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఆమెకు భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నప్పటికీ సురేష్ లెక్కచేయలేదు. ఆమెకు కూడా అంతే.. కుటుంబాన్ని వదిలేసిన పద్మ గతంలో యువకుడి కోసం విశాఖపట్నం నుంచి శ్రీకాళహస్తికి వచ్చేసింది. పోలీసుల ఫిర్యాదు చేసిన భర్త ఎలాగోలా ఇంటికి రప్పించాడు. కానీ సురేష్‌తోనే కలిసి జీవించాలని ఆమె నిర్ణయించుకుంది.
READ MORE: Top Headlines @9PM : టాప్ న్యూస్!
గతేడాది నవంబర్‌లో ఉత్తరం రాసి మళ్లీ ప్రియుడి చెంతకు చేరింది. కుటుంబ సభ్యులు ఎంత బతిమలాడినా ఫలితం లేకుండా పోయింది. పద్మ, సురేష్ పెళ్లి చేసుకున్నారు. యువకుడి కుటుంబీకులు అంగీకరించలేదు. కైలాసగిరి కాలనీలో పద్మతో సురేష్ కాపురం పెట్టారు. కొన్ని రోజులు బాగానే గడిచింది. మేన 22న పద్మ అకస్మాత్తుగా ఇంట్లో ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయాన్ని బయటకు రాకుండా సురేష్ సురేష్ ఈ విషయాన్ని బయటకు రానీయలేదు. మరునాడు తాను కూడా పురుగుల మందు తాగాడు.
READ MORE: Covid cases: దేశంలో రెండు కొత్త కరోనా వేరియంట్లు గుర్తింపు.. పెరుగుతున్న కేసులు..
సురేష్ ఇంటి నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. తాళాలు పగులగొట్టిన పోలీసులకు పద్మ మృతదేహం.. కొన ఊపిరితో ఉన్న సురేష్ ను చూసి షాక్ అయ్యారు. సురేష్‌ను ఆస్పత్రికి తరలించారు. శనివారం రాత్రి సురేష్ చికిత్స పొందుతూ కన్నుముశాడు. టిఫిన్, భోజనాన్ని వృథా చేయడంతో సురేష్ మందలించాడని.. గొడవ పెరిగి పెద్దదై పద్మ బలవన్మరణానికి పాల్పడేంత వరకు వచ్చిందని చెబుతున్నారు. చేతికొచ్చిన కొడుకు దూరం కావడంతో కుటుంబీకులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఈ వయసులో తప్పటడుగు వేసిన తల్లి మృత్యువు ఒడికి చేసుకోవడంతో పద్మ కుమారుడు, కుమార్తె కన్నీరు పెట్టుకున్నారు.
