NTV Telugu Site icon

Mumbai: ముంబైలో అగ్నిప్రమాదం.. 25 వాహనాలు దగ్ధం

Mumbai Fire

Mumbai Fire

ముంబైలో భారీ అగ్నిప్రమాదం (Mumbai Fire Accident) సంభవించింది. బోరివాలి ప్రాంతంలోని పార్కింగ్ స్థలంలో పార్క్ చేసిన వాహనాల్లో మంటలు చెలరేగాయి. దీంతో పార్కింగ్‌లో నిలిపి ఉంచిన 25కు పైగా వాహనాలు అగ్నికి అహుతి అయ్యాయి.

పార్కింగ్ స్థలంలో మంటలు అంటుకోగానే స్థానికులు అగ్రిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న మూడు ఫైరింజన్లు మంటలను ఆర్పుతున్నాయి.

మంటలకు గల కారణాలు ఇంకా తెలియలేదని ముంబై అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. సమాచారం అందిన వెంటనే సంఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేసినట్లు తెలిపారు. దాదాపు 25 నుంచి 26 వాహనాలు కాలిపోయి ఉంటాయని పేర్కొన్నారు. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదిలా ఉంటే గురువారం ఢిల్లీ అలీపూర్‌లోని పెయింటింగ్ ఫ్యాక్టరీలో జరిగిన అగ్నిప్రమాదంలో 11 మంది సజీవదహనం అయ్యారు. పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.