Site icon NTV Telugu

Mahalaxmi Scheme : మహాలక్ష్మిని వినియోగించుకున్న 24 .05 కోట్ల మహిళలు

Telangana Free Bus For Woman

Telangana Free Bus For Woman

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన మహాలక్ష్మి పథకంలో భాగంగా ఇప్పటివరకు 24.05 కోట్ల మంది మహిళలు జీరో టికెట్ పై ప్రయాణించారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) యొక్క పల్లె వెలుగు, ఎక్సప్రెస్, నాన్-లగ్జరీ బస్సుల్లో రాష్ట్రంలో ఎక్కడికైనా మహిళలు ఉచితంగా ప్రయాణించేందుకు మహాలక్ష్మి జీరో టికెట్ పథకం అనుమతిస్తున్న విషయం విదితమే. ప్రభుత్వ ఉద్యోగులతో సహా శ్రామిక, గ్రామీణ మహిళలకు ఈ పథకం వరంగా మారింది, ఎందుకంటే, ప్రయాణానికి వెళ్లడానికి ఖర్చు చేసిన డబ్బును ఇప్పుడు ఆదాచేస్తూ తమ కుటుంబ అవసరాలకు వెచ్చిస్తున్నారు. ఈ పథకాన్ని ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి డిసెంబర్ 9, 2023న ప్రారంభించారు. జనవరి నెలలో మహిళా ప్రయాణికుల సంఖ్య రోజుకు 28.10 లక్షలకు పెరిగింది. కాగా ఫిబ్రవరి నెలలో రోజువారీ 30.56 లక్షలకు పెరిగింది.

  Off The Record : లోక్‌సభ ఎన్నికల్లో దుమ్ము దులిపేస్తామంటున్న BJP కి Medak లో అభ్యర్థులే లేరా..?

ఈ మార్చి నెలలో మహిళా ప్రయాణీకుల ఉచిత ప్రయాణం యొక్క రోజు వారీ గణాంకాలు ఈ విధంగా ఉన్నాయి. మార్చి 1వ తేదీన 32.08 లక్షలు, మార్చి 2న – 31.81 లక్షలు, మార్చి 3న 26.24 లక్షలు, మార్చి 4న 33.18 లక్షలు, మార్చి 5న 32.04 లక్షలు, మార్చి 6న 32.95 లక్షల మంది మహిళలు TSRTC బస్సుల్లో జీరో టికెట్ విధానంలో ప్రయాణించారు. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 2404.65 లక్షల మంది మహిళలు ప్రయాణించారు. మహాలక్ష్మి పథకం కింద మహిళల ప్రయాణీకుల ఉచిత ప్రయాణంపై సూచికలను పరిశీలిస్తే, మహిళల ప్రయాణాల పెరుగుదల గణనీయంగా పెరిగింది. డిసెంబర్ 2023 నెలలో రోజుకు సగటున 26.99 లక్షల మంది మహిళలు ఉచిత బస్సు సౌకర్యాన్ని పొందారు.

Top Headlines @9PM : టాప్ న్యూస్

Exit mobile version