ISIS Attack: సిరియా తూర్పు ప్రాంతంలో సిరియా సైనికులు ప్రయాణిస్తున్న బస్సుపై ముష్కరులు జరిపిన దాడిలో 23 మంది సిరియన్ సైనికులు మృతి చెందారు. అనేక మంది గాయపడ్డారని సిరియన్ అబ్జర్వేటరీ తెలిపింది. శుక్రవారం తెల్లవారుజామున ఈ దుర్ఘటన జరిగింది. ఉగ్రసంస్థ ఐఎస్ఐఎస్ ఈ దాడులకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఐసిస్ ఆధీనం నుంచి 2017లో ఇరాన్, 2019లో సిరియా బయటపడ్డాయి. అప్పటి నుంచి సిరియాలో వరుస దాడులు జరుగుతున్నాయి. గత కొంతకాలంగా సిరియాపై ఐఎస్ఐఎస్ ఉగ్రసంస్థ దాడులకు పాల్పడుతోంది. అలాగే స్లీపర్ సెల్స్‌తో దాడులు చేయిస్తోంది.
Also Read: Indian Railways: అలా చేస్తే.. రైల్వేకు రోజుకు రెండు లక్షల లీటర్ల డీజిల్ ఆదా
ఇరాక్‌తో సరిహద్దుగా ఉన్న డీర్ ఎల్-జోర్ ప్రావిన్స్‌లోని తూర్పు పట్టణం మయాదీన్ సమీపంలోని ఎడారి రహదారిపై జరిగిన దాడిలో 23 మంది సిరియన్ సైనికులు మరణించారని, 10 మంది గాయపడ్డారని బ్రిటన్‌కు చెందిన సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ తెలిపింది. జిహాదీలు బస్సును చుట్టుముట్టి కాల్పులు జరిపిన దాడి తర్వాత డజన్ల కొద్దీ సైనికులు కనిపించకుండా పోయారని పేర్కొంది. తూర్పు సిరియాలో వార్తలను కవర్ చేసే మరో కార్యకర్త ఈ దాడిలో 20 మంది సైనికులు మరణించారని, ఇతరులు గాయపడ్డారని చెప్పారు.
Also Read: Rahul Gandhi: పార్లమెంట్‌లో ప్రధాని ప్రసంగంపై రాహుల్‌గాంధీ ఫైర్
ఐసిస్ సిరియా, ఇరాక్‌లోని పలు ప్రాంతాలను నియంత్రిస్తుండేది. కాలక్రమేణా ఐసిస్ ఆధీనం నుంచి సిరియా, ఇరాక్‌లు బయటపడ్డాయి. ఫిబ్రవరిలో సెంట్రల్ టౌన్ సుఖ్నా సమీపంలో కార్మికులపై ఐసిస్ స్లీపర్ సెల్స్ దాడి చేసి, దాదాపు 53 మందిని హత్య చేశారు. ఈ దాడిలో ఎక్కువగా కార్మికులు మృతి చెందగా.. కొంతమమంది సిరియన్ సైనిక సిబ్బంది కూడా ప్రాణాలు కోల్పోయారు. ఇటీవలి వారాల్లో ఐసిస్ సభ్యులు సిరియా ఉత్తర, ఈశాన్య ప్రాంతాలలో తమ దాడులను పెంచారు. ఈ వారం ప్రారంభంలో జిహాదీల మాజీ కోట అయిన రాకా ప్రావిన్స్‌లో ఐసిస్ దాడిలో పది మంది సిరియా సైనికులు, ప్రభుత్వ అనుకూల యోధులు మరణించారని అబ్జర్వేటరీ మంగళవారం తెలిపింది.