Site icon NTV Telugu

Uttar Pradesh: సైకిల్‌ను తాకిందని.. ఐదేళ్ల బాలిక గొంతు కోసిన యువకుడు

Murder

Murder

21 years Old  slits 5-year-old’s throat for touching bicycle in Uttar Pradesh: ఈ మధ్య కాలంలో చిన్న చిన్న విషయాలకే మనుషుల ప్రాణాలను తీసేస్తున్నారు. మనిషి బతుకుకు విలువే లేకుండా పోతుంది. డబ్బులు కాజేశారని, పశువులను దొంగలించారని, అమ్మాయి కోసం అని, ఆఖరికి ఐదు రూపాయల దగ్గర కూడా ఒకరినొకరు చంపుకున్న ఘటనలు చూశాం. తాజాగా తన సైకిల్ పట్టుకుందని ఓ ఐదేళ్లను బాలికను గొంతుకోసి చంపాడు ఓ వ్యక్తి. అయితే ఆ వ్యక్తి చిన్నపిల్లాడు కాదు. 21 ఏళ్ల యువకుడు. ఈ షాకింగ్  ఘటన ఉత్తరప్రదేశ్ లోని నిచ్లాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లేధి గ్రామంలో జరిగింది. ఇది మంగళవారం నాడు జరిగింది.

Also Read: TomTom Traffic Index : ట్రాఫిక్ లోనే గడిచిపోతున్న జీవితం.. ఈ నగరాల్లో మరీ ఎక్కువ

వివరాల ప్రకారం ఐదేళ్ల మైనర్ బాలిక చ్లాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లేధి గ్రామంలో మంగళవారం నాడు తన స్నేహితులతో కలిసి ఓ తోటలో ఆడుకుంటుంది. ఇంతలో దీపక్ అనే 21 ఏళ్ల యువకుడు సైకిల్ వేసుకొని అక్కడికి వచ్చాడు. అయితే ఆ బాలిక ఆడుకుంటూ ఆ యువకుడి సైకిల్ ను తాకింది. దీంతో  ఆ యువకుడికి కోపం వచ్చి నా సైకిల్ నే ముట్టుకుంటావా అంటూ ఆ బాలికతో ఘర్షణకు దిగాడు. అంతేకాకుండా ఆ బాలిక గొంతు కూడా కోశాడు. దీంతో ఐదేళ్ల చిన్నారి అక్కడికక్కడే చనిపోయింది. అక్కడికి చేరుకున్న స్థానికులు ఆ బాలికను కాపాడేందుకు ప్రయత్నించినా అప్పటికే చనిపోయింది. వెంటనే ఈ సమాచారాన్ని పోలీసులకు అందించారు స్థానికులు. అక్కడికి చేరుకున్న పోలీసులు దీపర్ ను అరెస్ట్ చేశారు. బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. నిందితులను విచారిస్తున్నామని, కేసును అన్ని కోణాల్లో విచారిస్తున్నామని  పోలీసులు తెలిపారు. తన సైకిల్‌ను తాకడంతో దీపక్ బాలిక గొంతు కోసి చంపాడని అదనపు పోలీసు సూపరింటెండెంట్ (ASP) ఆతీష్ కుమార్ సింగ్ తెలిపారు.

 

Exit mobile version