NTV Telugu Site icon

Jio Recharge: బంపర్ ఆఫర్.. ప్రతిరోజూ 2GB డేటాతోపాటు అదనంగా 20GB ఉచితం..

Jio

Jio

Jio Recharge: భారతీయ టెలికాం రంగంలో భారీ మార్పులను తీసుకొచ్చిన కంపెనీ జియో. అయితే, ఈ మధ్య కాలంలో అనేక ప్లాన్‌ లను కాస్త ఖరీదైనదిగా చేసింది. ఈ టారిఫ్ పెంపుతో జియో వినియోగదారులు ఇప్పుడు తక్కువ ధరలో మరిన్ని ప్రయోజనాల ప్లాన్‌ల కోసం ఎదురుచూస్తున్నారు. ఇందులో భాగంగా.. వినియోగదారులకు రోజువారీ డేటాతో పాటు అదనపు డేటా సదుపాయాన్ని అందించే జియో ప్లాన్ గురించి వివరంగా తెలుసుకుందాం. ఈ ప్లాన్ లో జియో రోజువారీ డేటా యాక్సెస్‌ను అందిస్తుంది. అదే రూ. 899 ప్లాన్. జియో రూ.899 ప్లాన్‌తో గొప్ప ఆఫర్‌ను ముందుకు తీసుక వచ్చింది. ఈ ప్లాన్‌లో మీరు రోజువారీ డేటాతో పాటు 20GB అదనపు డేటాను ఉచితంగా పొందవచ్చు. ఈ ప్లాన్‌తో మీరు ప్రతిరోజూ అపరిమిత వాయిస్ కాలింగ్ చేసుకోవచ్చు, అలాగే 100 ఉచిత SMSలను పంపగలరు.

Also Read: Train Ticket Name Change: బుకింగ్ చేసిన రైలు టికెట్‭లో పేరును ఎలా మార్చుకోవాలంటే?

జియో రూ. 899 ప్లాన్‌లో మీకు 90 రోజుల వాలిడిటీ లభిస్తుంది. ఈ ప్లాన్ లో వినియోగదారులకు ప్రతిరోజూ 2GB డేటాను యాక్సెస్ చేస్తుంది. అయితే, ఈ ఆఫర్ కింద మీకు రోజువారీ డేటాతో పాటు వాలిడిటీ టైం మొత్తంలో 20GB అదనపు డేటా ఉచితంగా ఇవ్వబడుతుంది. దీని ప్రకారం 90 రోజుల చెల్లుబాటుతో ఈ ప్లాన్ మీకు మొత్తం 200GB డేటాకు యాక్సెస్ ఇస్తుంది. ఈ ఆఫర్ కింద మీరు డేటా కొరతను ఎదుర్కోరు. రోజువారీ డేటా ముగిసిన తర్వాత, ఇంటర్నెట్ వేగం @64 Kbpsకి పడిపోతుంది. అయితే ఈ ప్లాన్ లో 20GB అదనపు డేటా కారణంగా ఆ సమస్యను ఎదురుకోరు. అలాగే ఈ జియో ప్లాన్‌లో అపరిమిత వాయిస్ కాలింగ్ సదుపాయాన్ని పొందుతారు. సుదీర్ఘ వ్యాలిడిటీతో ఇటువంటి ప్లాన్ కోసం చూస్తున్నట్లయితే ఈ ప్లాన్ మీకు మంచి ఎంపికగా ఉంటుంది.

Also Read: Weather Update: తెలంగాణలో పెరుగుతున్న చలి.. వణుకుతున్న జిల్లా వాసులు..

Show comments