Nuclear Tests in 80 Years: కొన్ని అగ్రదేశాలు ప్రపంచానికి అణుబూచి చూపించి భయపెట్టి పబ్బం గడుపుతున్నాయి. వాస్తవానికి ఈ అణుబాంబులకు అంత పవర్ ఉందా అంటే.. కచ్చితంగా అనే సమాధానం సెకన్ ఆలస్యం లేకుండా వస్తుంది. ఎందుకంటే ఈ అణుబాంబుల విధ్వాంసానికి నాశమైన ప్రదేశాలు ప్రత్యేక్ష ఉదాహరణలుగా నిలిచాయి, అందుకే అణుబాంబులకు ప్రపంచం భయపడేది. 1945లో జపాన్‌లోని నాగసాకి, హిరోషిమాలో అణుదాడి కారణంగా సుమారుగా 2.10 లక్షల మంది ప్రజలు మరణించారు, లక్ష మందికి పైగా వికలాంగులయ్యారని తెలుసిన విషయమే. కానీ హిరోషిమా దాడి తర్వాత ప్రపంచంలో ఎన్ని అణు విస్ఫోటనాలు జరిగాయో ఎంత మందికి తెలుసు.. ఈ స్టోరీలో ఎన్ని అణు బ్లాస్ట్‌లు జరిగాయి, వాటిలో ఇండియాలో ఎన్ని జరిగాయో తెలుసుకుందాం..
READ ALSO: J&K Cyber Security Move: జమ్మూకశ్మీర్ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. అక్కడ ఈ సేవలు బంద్
2059.. నెంబర్ పెద్దదే..
ఆయుధ నియంత్రణ సంఘం నివేదికల ప్రకారం.. గత 80 ఏళ్లలో 2059 అణు బాంబులు బ్లా్స్ట్ అయ్యాయి. వీటిలో అత్యధికంగా అగ్రరాజ్యం అమెరికాలో జరిగాయి. దాని తర్వాత స్థానంలో కజకిస్థాన్, ఫ్రాన్స్ ఉన్నాయి. భారత్‌లో ఈ అణు విస్ఫోటనం 3 సార్లు జరిగింది, పొరుగు దేశమైన పాక్‌లో 2 సార్లు అణు బాంబు పేలుళ్లు జరిగినట్లు సమాచారం. 1945 తర్వాత ప్రపంచవ్యాప్తంగా అణ్వాయుధాలను తయారు చేయడానికి పోటీ ఏర్పడిందని ఆయుధ నియంత్రణ సంఘం చెబుతోంది. 1945 – 1996 మధ్య అమెరికా 1030 అణుబాంబు పేలుళ్లు జరిగాయి. ప్రస్తుతం అగ్రరాజ్యం వద్ద 3900 అణ్వాయుధాలు ఉన్నాయి. 1950 ప్రాంతంలో రష్యా మొదటిసారి అణు పరీక్షలు నిర్వహించింది. మాస్కో కజకిస్థాన్‌లో అత్యధిక సంఖ్యలో అణుబ్లాస్ట్‌లు చేసింది. ప్రస్తుతం రష్యా వద్ద 4100 కంటే ఎక్కువ అణ్వాయుధాలు ఉన్నాయి. ఫ్రాన్స్ ఇప్పటి వరకు 210 అణు పరీక్షలు నిర్వహించింది. చైనా 45, బ్రిటన్ 45 సార్లు అణుబాంబు పరీక్షలు చేశాయి. ఈ అణు విస్ఫోటనం వరుసలో చివరి దేశం ఉత్తర కొరియా. చైనా వద్ద 600, ఇండియా వద్ద 180, పాకిస్థాన్ వద్ద 150, ఉత్తర కొరియా వద్ద 50 అణ్వాయుధాలు ఉన్నాయి.
అణు పరీక్షలు ఎక్కడ జరిగాయి..
అమెరికా నెవాడా, మార్షల్ దీవులు, మధ్య పసిఫిక్ మహాసముద్రంలో 1,000 కి పైగా అణు పరీక్షలను నిర్వహించింది. రష్యా కజకిస్థాన్, ఆర్కిటిక్ మహాసముద్రంలోని నోవాయా జెమ్లియా ద్వీపసమూహంలో తన అణ్వాయుధాలను పరీక్షించింది. బ్రిటన్, ఆస్ట్రేలియా, పసిఫిక్ మహాసముద్రంలోని కిరిటిమతి దీవులలో పరీక్షించగా, ఫ్రాన్స్ అల్జీరియా, ఫ్రెంచ్ పాలినేషియాలో పేలుళ్లు నిర్వహించింది. చైనా తన అణు పరీక్షను పశ్చిమ జిన్జియాంగ్ ప్రావిన్స్‌లోని మారుమూల ఎడారి ప్రదేశంలో నిర్వహించింది. భారతదేశం పోఖ్రాన్‌లో, పాకిస్థాన్ బలూచిస్తాన్‌లో అణు పరీక్షలను నిర్వహించాయి. ఉత్తర కొరియా చైనాకు ఆనుకుని ఉన్న ఒక ద్వీపంలో అణు పరీక్షలు జరిపింది.
చాలా అణు పరీక్షలు ఇసుకలో, నీటిలో జరిగాయి. సంవత్సరాల తరువాత ఇప్పుడు మెల్లగా వాటి ప్రభావాలు కనిపిస్తున్నాయి. కజకిస్థాన్‌లో ప్రజలు తమ భవిష్యత్ తరాలు కూడా ఈ పేలుడు వల్ల బాధపడతారని అంటున్నారు. సుమారు 12 లక్షల మంది కజకిస్థాన్ ప్రజలు పరిహారం కోసం దరఖాస్తు చేసుకున్నారు. అమెరికా పరీక్షల కోసం మార్షల్ దీవుల ప్రజలను ఇతర ప్రదేశాలకు తరలించింది. అయినప్పటికీ 27 వేల మంది ఈ అణు కార్యక్రమాలతో బాధపడుతున్నారు. ఫ్రాన్స్ అల్జీరియా ప్రజలకు క్షమాపణ కూడా చెప్పింది. ఫ్రాన్స్ ప్రజలు అల్జీరియాకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటారని ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ప్రకటించారు.
READ ALSO: Nara Rohith: ఈ సినిమా లైన్ చెబితే కంగారు పడ్డా.. కానీ అందరికీ కనెక్ట్ అవుతుంది!
