Site icon NTV Telugu

Yamaha FZ-X Hybrid: కొత్త బైక్ కొనాలనుకుంటున్నారా?.. యమహా FZ-X హైబ్రిడ్ విడుదల.. ఈ బైక్ పై ఓ లుక్కేయండి

Yamaha Fz X Hybrid

Yamaha Fz X Hybrid

ప్రముఖ టూవీలర్ తయారీ సంస్థ యమహా దేశంలోనే మొట్టమొదటి హైబ్రిడ్ బైక్ యమహా FZ-S Fi హైబ్రిడ్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఇప్పుడు కంపెనీ తన రెండవ హైబ్రిడ్ బైక్‌ను తీసుకువచ్చింది. యమహా FZ‑X హైబ్రిడ్ పేరిట రిలీజ్ చేసింది. హైబ్రిడ్ ఇంజిన్ టెక్నాలజీని దాని నియో-రెట్రో స్ట్రీట్ బైక్‌కు పరిచయం చేసింది. ధర రూ. 1,49,990 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ), కొత్త FZ-X కలర్ TFT మీటర్, టర్న్-బై-టర్న్ నావిగేషన్‌తో సహా టెక్ అప్‌గ్రేడ్‌లతో వస్తుంది.

Also Read:Earthquake: ఇండోనేసియాలో భారీ భూకంపం.. భయంతో ప్రజలు బెంబేలు

యమహా FZ‑X హైబ్రిడ్ 149cc ఎయిర్-కూల్డ్, సింగిల్-సిలిండర్ ఇంజిన్‌ను కలిగి ఉంది. ఇది 12.4 hp శక్తిని, 13.3 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని ఇంజిన్ 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేశారు. బైక్ బరువు141 కిలోలు. దీనిలోని హైబ్రిడ్ వ్యవస్థను ప్రధానంగా మైలేజ్ పెంచడానికి ఉపయోగిస్తారు. దీని ఇంజిన్ స్పెసిఫికేషన్‌లు మునుపటిలాగే ఉంచారు. యమహా FZ‑X హైబ్రిడ్‌కు సైలెంట్ స్టార్ట్, స్టార్ట్/స్టాప్ టెక్నాలజీ (ISG), అప్‌డేట్ చేయబడిన స్విచ్ గేర్, కొత్త ఫంక్షన్‌ల నియంత్రణ, 4.2 కలర్ TFT డిస్‌ప్లే ఇచ్చారు. గోల్డె్న్ కలర్ వీల్స్ మ్యాట్ టైటాన్ గ్రీన్ కలర్‌లో ప్రత్యేకమైన లుక్ అట్రాక్ట్ చేస్తోంది.

Exit mobile version