Site icon NTV Telugu

2025 Tata Altroz: టాటా ఆల్ట్రోస్ ఫేస్‌లిఫ్ట్ 2025 లాంచ్.. వివిధ వేరియెంట్ ధరలు ఇలా..!

2025 Tata Altroz

2025 Tata Altroz

2025 Tata Altroz: టాటా మోటార్స్ 2025 ఆల్ట్రోస్ ఫేస్‌లిఫ్ట్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ కారు ప్రారంభ ధర రూ. 6.89 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా నిర్ణయించారు. 2020 జనవరిలో ప్రారంభమైన ఆల్ట్రోస్‌కి ఇది పెద్ద అప్‌డేట్. కొత్త డిజైన్, ఆధునిక సాంకేతికత, మెరుగైన భద్రతా ఫీచర్లతో ఈ కార్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. ఇది మారుతి సుజుకి బలెనో, హ్యుందాయ్ i20 వంటి హాచ్బ్యాక్ కార్లకు గట్టి ఇవ్వనుంది. ఇకపోతే ఈ టాటా ఆల్ట్రోస్ 2025 మోడల్ స్మార్ట్, ప్యూర్, క్రియేటివ్, అకంప్లిష్డ్ S లాంటి నాలుగు ట్రిమ్‌ లలో లభిస్తుంది. అలాగే ఇందులో 1.2L రెవోట్రాన్ పెట్రోల్ ఇంజిన్, 1.2L iCNG ఇంజిన్, 1.5L రెవోటార్క్ డీజిల్ ఇంజిన్ వంటి మూడు పవర్‌ ట్రెయిన్ ఆప్షన్లు ఉన్నాయి. మరి వివిధ వేరియంట్స్ కార్ల ధరలు ఇలా ఉన్నాయి.

Read Also: Vaibhav Suryavanshi: చిన్నోడిని చూసి మురిసిపోయిన పేరెంట్స్..!

పెట్రోల్ వేరియంట్ ధరలు (ఎక్స్-షోరూమ్):

స్మార్ట్: రూ. 6.89 లక్షలు

ప్యూర్: రూ. 7.69 లక్షలు

క్రియేటివ్: రూ. 8.69 లక్షలు

అకంప్లిష్డ్ S: రూ. 9.99 లక్షలు

iCNG వేరియంట్ ధరలు:

స్మార్ట్: రూ. 7.89 లక్షలు

ప్యూర్: రూ. 8.79 లక్షలు

క్రియేటివ్: రూ. 9.79 లక్షలు

అకంప్లిష్డ్ S: రూ. 11.09 లక్షలు

డీజిల్ వేరియంట్ ధరలు:

ప్యూర్: రూ. 8.99 లక్షలు

క్రియేటివ్: రూ. 9.99 లక్షలు

అకంప్లిష్డ్ S: రూ. 11.29 లక్షలు

Read Also: Kawasaki Versys-X 300: బండిని చూస్తేనే నడిపేయాలనిపించే కావసాకీ వర్సిస్-X 300 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్స్ ఇలా..!

అలాగే, పెట్రోల్ DCA వేరియంట్ ఇప్పుడు అకంప్లిష్డ్+S ట్రిమ్‌లో అందుబాటులో ఉంది. సన్‌రూఫ్ ఎంపిక ప్యూర్ అండ్ క్రియేటివ్ ట్రిమ్‌లలో లభిస్తుంది. ఇంకా డీజిల్ AMT వేరియంట్లు కూడా ప్యూర్ అండ్ క్రియేటివ్ ట్రిమ్‌లలో లభిస్తాయి. పాత డిజైన్‌ ను కొనసాగించినప్పటికీ, కొత్త ఆల్ట్రోస్‌ లో ఫ్లష్ డోర్ హ్యాండిల్స్, LED హెడ్‌లైట్స్, రిఫ్రెష్డ్ గ్రిల్, కొత్త బంపర్లు, 16-అంగుళాల అలాయ్ వీల్స్, కనెక్టెడ్ LED టెయిల్ లైట్స్ వంటి అప్డేట్లు ఉన్నాయి. ఈ కార్లు డ్యూన్ గ్లో, ఎంబర్ గ్లో, ప్రిస్టైన్ వైట్, ప్యూర్ గ్రే, రాయల్ బ్లూ వంటి ఐదు రంగులలో అందుబాటులో ఉంది. ఇక కారు లోపల రెండు-స్పోక్ స్టీరింగ్ వీల్, 10.25-అంగుళాల డిజిటల్ డిస్‌ప్లే వంటివి ఉన్నాయి.

Exit mobile version