NTV Telugu Site icon

Honda Amaze: ఏడాది చివరి నాటికి మార్కెట్లోకి కొత్త హోండా అమేజ్..

Amaze Honda

Amaze Honda

Honda Amaze New Version: హోండా మూడవ తరం కొత్త అమేజ్ ఈ సంవత్సరం డిసెంబర్‌లో విడుదల చేసే అవకాశాలు కనపడుతున్నాయి.. ఇంతకుముందు అక్టోబర్ నాటికి పండుగల సీజన్‌లో ప్రవేశపెట్టాలని అనుకున్నారు. ఇది 2018లో వచ్చిన రెండవ తరం హోండా అమేజ్‌కు అప్డేట్ మోడల్. ఇది హోండా సిటీ, ఎలివేట్ ప్లాట్‌ఫారమ్ సవరించిన సంస్కరణపై నిర్మించబడింది. ఈ కారు వీల్‌బేస్ సిటీ, ఎలివేట్ కంటే తక్కువగా ఉంటుంది. ఇంకా పొడవు 4 మీటర్ల కంటే తక్కువగా ఉంటుంది. ఇది హ్యుందాయ్ ఆరా, మారుతి డిజైర్‌ లకు పోటీగా ఉంటుంది.

Road Accident: మద్యం మత్తులో బైక్‌ ను గుద్దేసిన ఎస్‌యూవీ.. ఒక్కసారిగా చెలరేగిన మంటలు..

అయితే, కొత్త అమేజ్ లుక్ గురించి పెద్దగా తెలియదు. కానీ., అందిన సమాచారం మేరకు ఎంట్రీ లెవల్ సెడాన్ యొక్క స్టైలిష్ డిజైన్ అలాగే ఉంచబడతాయి. ఇది చూడడానికి విదేశాలలో విక్రయించే పెద్ద హోండా సెడాన్‌ల మాదిరిగానే ఉంటుంది. ఇంటీరియర్ గురించి చూస్తే, తాజా కారు తాజా క్యాబిన్ లేఅవుట్‌ ను పొందుతుంది. ఇందులో హోండా ఎలివేట్ మాదిరిగానే పెద్ద ఫ్రీ స్టాండింగ్ టచ్‌ స్క్రీన్ ఉంటుంది. ఖర్చులను తగ్గించడానికి ఇతర హోండా మోడళ్లతో భాగాలు పంచుకోవచ్చు.

ICC Player Of Month: జూలై నెల ప్లేయర్ ఆఫ్ ది మంత్ గా టీమిండియా ఆల్‭రౌండర్..

మూడవ తరం అమేజ్ ప్రస్తుత మోడల్ వలె అదే 1.2 లీటర్, 4 సిలిండర్, పెట్రోల్ ఇంజన్‌ను కలిగి ఉంటుందని అంచనా. ఇది 90hp శక్తిని, 110Nm టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. ట్రాన్స్‌మిషన్ కోసం, ఇది 5 స్పీడ్ మాన్యువల్ లేదా CVT ఆటోమేటిక్ గేర్‌ బాక్స్‌ తో జతచేయబడుతుంది. దీని ప్రారంభ ధర ప్రస్తుత మోడల్ యొక్క రూ. 7.92 లక్షల (ఎక్స్-షోరూమ్) కంటే ఎక్కువగా ఉంచబడుతుంది. సెడాన్ కార్ల విక్రయాలు క్షీణించడంతో కంపెనీ వార్షిక ఉత్పత్తి లక్ష్యాన్ని 56,000 నుంచి 40,000కు తగ్గించుకుంది.

Show comments