Site icon NTV Telugu

2024 T20 World Cup Live: టీ20 వరల్డ్ కప్ మ్యాచ్లను ఫ్రీగా చూసేయండి ఇలా..

T20 World Cup 2024

T20 World Cup 2024

2024 T20 World Cup Live: 2024 టీ20 ప్రపంచకప్‌లో తొలి మ్యాచ్‌కు టీమిండియా సిద్ధమైంది. ఈరోజు రాత్రి 8:00 గంటలకు న్యూయార్క్‌లో ఐర్లాండ్‌తో జరిగే తొలి మ్యాచ్‌లో రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమిండియా తన భవితవ్యాన్ని నిర్ణయించనుంది. ఐర్లాండ్ చిన్న జట్టు అయినప్పటికీ సంచలనాలకు పర్యాయపదంగా ఉంటుంది. ఎలాంటి నిర్లక్ష్యం చేసినా టీమిండియా భారీగా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది.

Mobile Theft: జాగ్రత్త గురూ.. రైల్వే స్టేషన్స్ లో మొబైల్స్ ఇలా కూడా దొంగలిస్తున్నారు.. వీడియో వైరల్..

ఇరు జట్ల బలాబలాలను పరిగణనలోకి తీసుకుంటే భారత జట్టు హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతుంది. అయితే., భారత్‌ అమెరికాలోని ప్రత్యామ్నాయ పిచ్‌లపై ఆడాల్సి వచ్చింది. ఈ విషయాన్ని భారత కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ప్రీ మ్యాచ్ మీడియా సమావేశంలో చెప్పాడు. ఈ మైదానాల్లో 140 పరుగులే గొప్ప లక్ష్యమని వివరించాడు. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్, యశస్వి జైస్వాల్‌ లతో టీమిండియా బ్యాటింగ్ విభాగం కాస్త బలంగానే కనపడుతోంది. అంతేకాదు గత రెండు నెలలుగా ఆడి ఐపీఎల్ లో అందరూ మంచి ఫామ్ లో ఉన్నారు. స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా మరోవైపు పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్‌లతో బౌలింగ్ విభాగం కూడా బాగా బలంగానే కనపడుతోంది.

Indian Army : అటవీ నిర్మూలనను ఎదుర్కోవడానికి 5,000 చెట్లను నాటిన ఇండియన్ ఆర్మీ..

ఇకపోతే 2024 ప్రపంచ కప్ మ్యాచ్‌లు భారతదేశంలోని అధికారిక స్టార్ స్పోర్ట్స్ ఛానెల్‌లో ప్రసారం చేయబడతాయి. స్టార్ స్పోర్ట్స్ 1 మాత్రమే కాకుండా, ఇతర భాషా ఛానెల్‌ లలో కూడా ఇది ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. తెలుగు, కన్నడ, మలయాళం, తమిళం, భోజ్‌పురి, హిందీలో ప్రత్యక్ష వ్యాఖ్యానం ఉంటుంది. స్టార్ గ్రూప్ యొక్క డిస్నీ హాట్స్టార్ OTT యాప్‌ లో వీటిని ఉచితంగా చూడొచ్చు. డిస్నీ హాట్స్టార్‌ లో భారత్‌ లో వరల్డ్ కప్ మ్యాచ్‌ లను ఉచితంగా వీక్షించవచ్చు. ఇక మరోవైపు దూరదర్శన్ టీమిండియా వరల్డ్ కప్ మ్యాచ్‌లను ఉచితంగా ప్రసారం చేస్తుంది.

Exit mobile version