NTV Telugu Site icon

2024 ICC Women’s T20 World Cup: మ‌హిళ‌ల టీ20 ప్ర‌పంచ‌క‌ప్ షెడ్యూల్ వచ్చేసిందోచ్.. భారత్, పాక్ మ్యాచ్ అప్పుడే..

Icc Women's T20 World Cup

Icc Women's T20 World Cup

తాజాగా మహిళల టి20 ప్రపంచ కప్ 2024 సంబంధించిన పూర్తి షెడ్యూల్ ప్రపంచ క్రికెట్ కౌన్సిల్ విడుదల చేసింది. బంగ్లాదేశ్ వేదికగా జరగబోతున్న ఈ మెగా టోర్నీ అక్టోబర్ మూడు నుంచి అక్టోబర్ 20 వరకు జరగబోతోంది. మొత్తం 23 మ్యాచులు ఈ టోర్నీలో జరగనున్నాయి. పది జట్లు పాల్గొననున్న ఈ ప్రపంచ కప్ పోటీలో ఇప్పటికే ఎనిమిది టీమ్స్ అర్హత సాధించగా.. తాజాగా క్వాలిఫై రౌండ్ల ద్వారా స్కాట్లాండ్, శ్రీలంకలు ప్రపంచం కప్ లో పాల్గొనబోతున్నాయి.

Also Read: 2024 ICC Women’s T20 World Cup: పొట్టి ప్రపంచకప్‌కు అర్హత సాధించిన శ్రీలంక, స్కాట్లాండ్‌ జట్లు..

ఇక ఈ పది టీమ్స్ ను రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్ A లో క్వాలిఫైయర్ 1 గా సెలెక్ట్ అయిన శ్రీలంక, భారత్, పాకిస్తాన్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా టీమ్స్ ఉండగా.. గ్రూప్ B లో క్వాలిఫైయర్ 2 గా స్కాట్లాండ్, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, బంగ్లాదేశ్, వెస్టిండీస్ టీమ్స్ ఉన్నాయి.

Also Read: MS Dhoni: ఎంఎస్ ధోనీ ఆడకపోవడమే మంచిది.. హర్భజన్ సింగ్ ఫైర్!

ఈ మెగా టోర్నీలో టీమిండియా తన మొదటి మ్యాచ్ అక్టోబర్ 4న న్యూజిలాండ్ తో మొదలు పెట్టబోతోంది. ఇక ఆ తర్వాత మ్యాచ్ అక్టోబర్ 6న చిరకాల ప్రత్యర్థులైన టీమిండియా, పాకిస్తాన్ టీమ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఇక ఈ మిగతా మ్యాచ్ లకు సంబంధించి పూర్తి షెడ్యూల్ ఈ విధంగా ఉంది.

* అక్టోబర్ 3 – ఇంగ్లాండ్‌ vs సౌతాఫ్రికా – ఢాకా వేదిక‌
* అక్టోబర్ 3 – బంగ్లాదేశ్ vs క్వాలిఫైయర్ 2 స్కాట్లాండ్ – ఢాకా
* అక్టోబర్ 4 – ఆస్ట్రేలియా vs క్వాలిఫైయర్ 1 శ్రీలంక– సిల్హెట్
* అక్టోబర్ 4 – భారత్ vs న్యూజిలాండ్ – సిల్హెట్
* అక్టోబర్ 5 – దక్షిణాఫ్రికా vs వెస్టిండీస్ – ఢాకా
* అక్టోబర్ 5 – బంగ్లాదేశ్ vs ఇంగ్లాండ్ – ఢాకా
* అక్టోబర్ 6 – న్యూజిలాండ్ vs క్వాలిఫైయర్ 1 – సిల్హెట్
* అక్టోబర్ 6 – భారత్ vs పాకిస్థాన్ – సిల్హెట్
* అక్టోబర్ 7 – వెస్టిండీస్ vs క్వాలిఫయర్ 2 స్కాట్లాండ్– ఢాకా
* అక్టోబర్ 8 – ఆస్ట్రేలియా vs పాకిస్తాన్ – సిల్హెట్
* అక్టోబర్ 9 – బంగ్లాదేశ్ vs వెస్టిండీస్ – ఢాకా
* అక్టోబర్ 9 – భారత్ vs క్వాలిఫైయర్ 1 శ్రీలంక– సిల్హెట్
* అక్టోబర్ 10 – దక్షిణాఫ్రికా vs క్వాలిఫైయర్ 2 స్కాట్లాండ్– ఢాకా
* అక్టోబర్ 11 – ఆస్ట్రేలియా vs న్యూజిలాండ్ – సిల్హెట్
* అక్టోబర్ 11 – పాకిస్థాన్ vs క్వాలిఫైయర్ 1 శ్రీలంక– సిల్హెట్
* అక్టోబర్ 12 – ఇంగ్లండ్ vs వెస్టిండీస్ – ఢాకా
* అక్టోబర్ 12 – బంగ్లాదేశ్ vs సౌతాఫ్రికా – ఢాకా
* అక్టోబర్ 13 – పాకిస్థాన్ vs న్యూజిలాండ్ – సిల్హెట్
* అక్టోబర్ 13 – భారత్ vs ఆస్ట్రేలియా – సిల్హెట్
* అక్టోబర్ 14 – ఇంగ్లండ్ vs క్వాలిఫైయర్ 2 స్కాట్లాండ్– ఢాకా
* అక్టోబర్ 17 – మొదటి సెమీ-ఫైనల్ – సిల్హెట్
* అక్టోబర్ 18 – రెండవ సెమీ-ఫైనల్ – ఢాకా
* అక్టోబర్ 20 – ఫైనల్ – ఢాకా