2018 Movie: భారతీయ చిత్ర పరిశ్రమ ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ అవార్డు కొల్లగొట్టి ఇండియన్ సత్తా ఎంతో ప్రపంచానికి తెలిపింది. దేశ చిత్రపరిశ్రమల్లో మాలీవుడ్ ప్రత్యేకత వేరు. అక్కడ తక్కువ బడ్జెట్ తోటి నేటివిటీకి దగ్గరగా చిత్రాలను నిర్మిస్తుంటారు.మాలీవుడ్ చిత్రసీమలో రీసెంట్గా రిలీజైన ఓ సినిమా బాక్సాఫీస్ ఎదుట రికార్డులను సృష్టిస్తోంది. రూ.15కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం కేవలం పది రోజుల్లోనే రూ.100కోట్ల కలెక్షన్లను రాబట్టింది. అది కూడా ఇండియా రేంజ్లో కాకుండా కేవలం అక్కడి బాక్సాఫీస్వద్దే ఈ కలెక్షన్స్‌ను అందుకోవడం విశేషం.
Read Also:Theif : దేవుడు కలలో చెప్పాడు.. అందుకే తీసిన నగలు ఇచ్చేస్తున్నాను
టోవినో థామస్ హీరోగా జూడ్ ఆంథనీ జోసెఫ్ డైరెక్షన్‌లో రూపొందిన చిత్రం ‘2018’. ‘ఎవ్రీవన్ ఈజ్ ఏ హీరో’ అనేది చిత్ర ఉపశీర్షిక. క్యాప్షన్‌కు తగ్గట్లే ఈ కథ నడుస్తుంది. అంటే ఈ చిత్రంలో ప్రతిఒక్కరూ హీరోలే అని క్యాప్షన్ అర్థం. ఈ చిత్రం ప్రస్తుత వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కింది. 2018లో కేరళను వరదలు అతలాకుతలం చేశాయి. వందల మంది మరణించారు.. లక్షలాది జనాలు నిరాశ్రయులయ్యారు. ఆ నేపథ్యాన్నే కథాంశంగా తీసుకుని డైరెక్టర్ జూడ్ ఆంథనీ సినిమాను తెరకెక్కించారు. సామాన్యులు హీరోలుగా మారితే ఎలా ఉంటుందనేది చిత్రసారాంశం. ఆకస్మాత్తుగా పోటెత్తిన వరదలతో అతలాకుతలమైన ఓ ప్రాంతంలో సహాయక చర్యలు ఏ విధంగా సాగాయి? ఆ సహాయక చర్యల్లో అక్కడి ప్రజలు ఎలా భాగమయ్యారు? చివరికి ఏం జరిగిందనేదే ఈ చిత్ర కథ.
Read Also:Man Kills Son: రెండో భార్యతో గొడవ.. కొడుకును కత్తితో గొంతుకోసి చంపిన కసాయి తండ్రి
అత్యంత వేగంగా ఆ చిత్రం వంద కోట్ల క్లబ్‌లోకి చేరింది. కేవలం రూ.15 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ‘2018’.. మే 5న కేవలం మలయాళం బాక్సాఫీస్ ముందే రిలీజ్ అయ్యింది. సర్వైవల్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రానికి మలయాళ సినీ ప్రియులు బ్రహ్మరథం పట్టారు. అలా ఇటీవలే రిలీజైన ఈ చిత్రం కేవలం పదిరోజుల్లోనే వందకోట్ల క్లబ్‌లోకి చేరిపోయింది. ఇంత వేగంగా ఈ ఘనత సాధించిన మలయాళ చిత్రం ఇదే కావడం విశేషం. గతంలో లూసిఫర్, కురూప్ లాంటి చిత్రాలు రూ.100కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టినా.. అవి ఫుల్ రన్‌లో ఆ మార్క్‌ను అందుకున్నాయి.
