Site icon NTV Telugu

Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌ను కలిసిన 20 మంది జనసేన ఎమ్మెల్యేలు..

Pawan Kalyan

Pawan Kalyan

Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను కలిశారు.. తాజాగా గెలిచిన జనసేన పార్టీకి చెందిన 20 మంది ఎమ్మెల్యేలు.. తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు సహా 20 మంది ఎమ్మెల్యేల ఈ రోజు జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో పార్టీ చీఫ్‌ను కలిశారు.. ఈ ఎన్నికల్లో తమకు అవకాశం ఇవ్వడంతో పాటు.. తమ గెలుపునకు కృషి చేసిన పవన్‌కు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.. ఇక, ఈ సందర్భంగా తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని పవన్‌ కల్యాణ్‌కు అందజేశారు ఆరణి శ్రీనివాసులు.. భారీ మెజారిటీతో గెలిచావ్ అంటూ ఆరణి భుజం తట్టి అభినందించారు పవన్‌.. ఆ తర్వాత జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబును కలిశారు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, ఆరణి మధన్, ఆరణి జగన్.. కాగా, ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ-బీజేపీతో కలిసి పోటీకి దిగిన జనసేన.. తను పోటీ చేసిన 21 అసెంబ్లీ స్థానాలతో పాటు.. రెండు పార్లమెంట్‌ స్థానాల్లోనూ విజయకేతనం ఎగురవేసిన విషయం విదితమే.. అంటే.. పోటీ చేసిన ప్రతీ నియోజకవర్గంలోనూ విజయం సాధించి రికార్డు సృష్టించారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.

Read Also: Lok Sabha Elections2024: జైలులో ఉండి ఎంపీలుగా విజయం.. ప్రమాణ స్వీకారం పరిస్థితేంటి?

Exit mobile version