Congo : ఆఫ్రికా దేశమైన కాంగోలో ఉగ్రవాదులు మరోసారి నరమేథానికి పాల్పడ్డారు. పశ్చిమ కాంగోలోని బెనీ ప్రావిన్స్‌లో ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారు. ఈ దాడుల్లో దాదాపు 20 మందికి పైగా సాధారణ ప్రజలు చనిపోయారని సమాచారం. ఇది ఇలా ఉంటే, దాడికి పాల్పడింది తామేనని ఇస్లామిక్ స్టేట్స్ ఉగ్రసంస్థ బాధ్యత వహిస్తూ ప్రకటన చేసింది. బెనీ టెర్రిటరీలోని ముసందబాలో 20 మృతదేహాలను గుర్తించామని అక్కడి అధికారులు ప్రకటించారు.
Read Also: Married Couples Protest : పోలీసులు చర్య తీసుకుంటేనే పెళ్లి చేసుకుంటాం
కాగా, ఉగాండాకు చెందిన అల్లైండ్ డెమొక్రటిక్ ఫోర్సెస్ గ్రూప్ స్థానికులపై దాడులకు పాల్పడిందని ఆర్మీ అధికారులు ఆరోపించారు. ఈ ఏడాది మార్చి 20న కూడా తూర్పు ఇటూరి, ఉత్తర కివు ప్రావిన్సుల్లో ఉగ్రవాదులు రెండు వేర్వేరు దాడుల్లో 22 మందిని హతమార్చడమే కాకుండా ముగ్గురు వ్యక్తులను ఎత్తుకెళ్లారు. ఇటూరి ప్రావిన్స్‌లోని పలుగ్రామాలపై దాడులకు పాల్పడి 12 మందిని ఊచకోతకోశారు. అదేవిధంగా కివు ప్రావిన్స్‌లో 10 మందిని చంపేశారు.
Read Also: Instagram Job Scam: ఒకే ఒక్క క్లిక్‌తో రూ.8.6లక్షలు స్వాహా.. ఉద్యోగం పేరుతో మోసం