Site icon NTV Telugu

Viral Video: రీల్స్కు అడ్డాగా మారిన ఢిల్లీ మెట్రో.. ఇద్దరు యువతుల డ్యాన్స్ వైరల్

Delhi Metro

Delhi Metro

మెట్రో రైళ్లు అంటేనే నిత్యం నగరవాసులతో రద్దీగా ఉంటాయి. ఇక ఆ మెట్రో రైళ్లలో కొందరు ప్రవర్తించే తీరు ఇతర ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. గతంలో వెలుగులోకి వచ్చిన ఘటనలు మరిచిపోకముందే.. మరో సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక.. ఢిల్లీ మెట్రో గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఢిల్లీ మెట్రో సోషల్ మీడియాకు కేరాఫ్ అడ్రస్గా నిలుస్తోంది. ఇప్పటికే అధికారులు మెట్రోలో రీల్స్ చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ యువతీ యువకులు రచ్చ ఆపడం లేదు. చాలాసార్లు ఢిల్లీ మెట్రోలో డ్యాన్స్, సాంగ్స్ చేస్తూ.. సోషల్ మీడియాలో హైలెట్ కావడం కోసం చేసిన వారు చాలామంది ఉన్నారు. ఈ క్రమంలో ఢిల్లీ మెట్రో తరుచూ వార్తల్లో నిలుస్తోంది. తాజాగా.. ఢిల్లీ మెట్రోలో మరో ఇద్దరు యువతులు కలిసి డ్యాన్స్ చేయడం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. భోజ్‌పురి పాటకి డ్యాన్స్ వేస్తూ కనిపించారు.

Read Also: Bomb Threat: “ఫన్” కోసం 13 ఏళ్ల బాలుడి తుంటరి పని.. చివరకు..

ఈ వీడియోలో ఇద్దరు మహిళలు తమ జుట్టును విరబూసుకుని, మెట్రో రైలులో ఓ రాడ్ పక్కన డ్యాన్స్ చేస్తూ ఉన్నారు. అయితే.. వారు డ్యాన్స్ చేస్తుంటే, ప్రయాణికులు అది చూడటానికి అంత ఆసక్తి చూపలేదు. తరుచుగా ఢిల్లీ మెట్రోలో ఇలాంటి రీల్స్ చేస్తుండటంతో ప్రయాణికులకు కూడా కామన్ అయిపోయినట్లు ఉంది. ఏదేమైనప్పటికీ ఇద్దరు యువతులు చేసిన డ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కాగా.. ఈ వీడియోను ‘X’లో షేర్ చేయగా.. నెటిజన్లు రకరకలుగా కామెంట్స్ చేస్తున్నారు.

Read Also: Aishwarya: నటుడి కొడుకుని సైలెంటుగా పెళ్లి చేసుకున్న స్టార్ హీరో కూతురు

Exit mobile version