Site icon NTV Telugu

Indian Army: జమ్మూ కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం

Indian Army

Indian Army

జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్ సెక్టార్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో భద్రతా దళాలు ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చాయి. దేగ్వార్ సెక్టార్‌లోని ఎల్‌ఓసీ సమీపంలో ఉగ్రవాదుల అనుమానాస్పద కార్యకలాపాల గురించి సమాచారం అందిందని భద్రతా దళాలు తెలిపాయి. ఆ తర్వాత భారత సైన్యం, జమ్మూ కాశ్మీర్ పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ ప్రారంభించారు. ఈ సమయంలో, ఉగ్రవాదులు భద్రతా దళాల బృందంపై కాల్పులు జరిపారు. అప్రమత్తమైన భద్రతా దళాలు ఉగ్రమూకలపై ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులను హతమయ్యారు.

Also Read:UK Warns: గాజాలో కాల్పులు ఆపకపోతే పాలస్తీనాకే మద్దతిస్తాం.. బ్రిటన్‌పై మండిపడ్డ నెతన్యాహు

దేగ్వార్ సెక్టార్‌లోని ఎల్‌ఓసీ సమీపంలో అనుమానాస్పద కార్యకలాపాల గురించి సమాచారం అందిందని భద్రతా దళాలు తెలిపాయి. దీని ఆధారంగా, సైన్యం వెంటనే ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించింది. ఈ ఆపరేషన్ సమయంలో, ఉగ్రవాదులు భద్రతా దళాలపై కాల్పులు జరిపారు. ఎదురు కాల్పులు జరిపిన సైన్యం ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చింది. హతమైన ఉగ్రవాదులు పాకిస్తాన్ నుంచి చొరబడటానికి ప్రయత్నించారని తెలిపారు. ఆ ప్రాంతాన్నంతా జల్లెడ పడుతున్నాయి భద్రతా బలగాలు.

Exit mobile version