Bomb Blast : పాక్‌లోని బలూచిస్థాన్‌లోని ఖుజ్దార్ నగరంలోని అఘా సుల్తాన్ ఇబ్రహీం రోడ్‌లో బాంబు పేలుడు సంభవించింది. ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైజ్ (ఐఈడీ) ద్వారా వాహనాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు డిప్యూటీ కమిషనర్ ఖుజ్దార్ ధృవీకరించారు. బలూచిస్థాన్ సీఎం అబ్దుల్ ఖుద్దూస్ బిజెంజో బాంబు దాడిని ఖండించారు. ఉగ్రవాదులు అమాయక పౌరులను టార్గెట్ చేస్తున్నారని, అలాంటి కుట్రలను ప్రభుత్వం తిప్పికొడుతుందన్నారు. ద్వేషపూరిత శక్తులు ఇటువంటి పిరికిపంద చర్యలు బెలూచిస్తాన్‌లో కష్టపడి సంపాదించిన శాంతి, శ్రేయస్సును విధ్వంసం చేయలేవన్నారు. 2021లో పాకిస్తాన్ ప్రభుత్వంతో కాల్పుల విరమణ ఒప్పందాన్ని చట్టవిరుద్ధమైన తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్ (TTP) ముగించినప్పటి నుండి బలూచిస్తాన్‌లో జరిగిన దాడి తీవ్రవాద దాడుల శ్రేణిలో తాజాది.
Read Also: Risky Heart Surgery: గర్భం లోపల శిశువుకు ఆపరేషన్ చేసిన ఎయిమ్స్ డాక్టర్లు
పాకిస్థాన్‌లోని క్వెట్టా పోలీస్ లైన్స్ ఏరియా సమీపంలో ఆదివారం జరిగిన పేలుడులో కనీసం ఐదుగురు గాయపడ్డారని రెస్క్యూ అధికారులను ఉటంకిస్తూ డాన్ వార్తాపత్రిక నివేదించింది. ఈ దాడికి తామే బాధ్యులమని తెహ్రీక్-ఏ-తాలిబాన్ పాకిస్థాన్ (టీటీపీ) ప్రకటించింది. గత నెలలో బలూచిస్థాన్‌లోని ఖుజ్దార్ జిల్లాలో మాగ్నెటిక్ బాంబు దాడిలో పోలీసు వ్యాన్ డ్రైవర్, ఒక అధికారి మరణించగా మరొకరికి గాయాలయ్యాయి.
Read Also:Sim Card: మీ ఆధార్ నెంబర్ పై ఎన్ని సిమ్ కార్డులున్నాయో తెలుసా?
ఫిబ్రవరిలో, పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్స్‌లోని కోహ్లు జిల్లాలో జరిగిన పేలుడులో ఫ్రాంటియర్ కార్ప్స్‌లోని ఇద్దరు అధికారులు మరణించారు. ముగ్గురు సైనికులు గాయపడిన మరొక సంఘటన జరిగింది. కోహ్లు జిల్లాలోని కహాన్ ప్రాంతంలో దుండగులకు వ్యతిరేకంగా ఆపరేషన్‌లో పాల్గొన్న సైనికుల వాహనం సమీపంలో పేలుడు సంభవించింది. నేరస్తులను పట్టుకునేందుకు ఈ ప్రాంతంలో ఆపరేషన్ కొనసాగుతోందని ప్రభుత్వం ప్రకటించింది.