Assam-Arunachal border: అస్సాంలోని ధేమాజీ జిల్లాలోని అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దులో సోమవారం జరిగిన కాల్పుల్లో ఇద్దరు వ్యక్తులు మరణించారు. మరో ముగ్గురు అదృశ్యమయ్యారు. పోలీసులు ఈ సమాచారం ఇచ్చారు. ఈ సందర్భంగా ఎస్పీ రంజన్ భుయాన్ మాట్లాడుతూ.. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా అంతర్రాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో స్థానిక ప్రజలు మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దాని సన్నాహాలకు సంబంధించి ఉదయం ఏడుగురు గ్రామస్తులు సంఘటనా స్థలానికి చేరుకున్నారని, అప్పుడే నిందితులు కాల్పులు ప్రారంభించారని చెప్పారు. ఈ కాల్పుల్లో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడగా, స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
Read Also:Payal rajputh : ఏంటి పాప.. కింద ప్యాంట్ మర్చిపోయావా..
మరో ముగ్గురు గల్లంతయ్యారని, వారి కోసం పోలీసులు గాలిస్తున్నారని ఎస్పీ తెలిపారు. సమాచారం అందుకున్న మా బృందం సంఘటనా స్థలానికి చేరుకుందని ఘటనపై దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఈ ప్రాంతంలో అంతర్రాష్ట్ర సరిహద్దు వివాదం ఉన్నందున అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన కొందరి ప్రమేయం ఉందని స్థానిక ప్రజలు ఆరోపించారు. అస్సాం – అరుణాచల్ ప్రదేశ్ 804-కిమీల పొడవైన సరిహద్దును పంచుకుంటున్నాయి. సరిహద్దు వివాదాలను పరిష్కరించేందుకు ఇరుపక్షాలు చర్చలు జరుపుతున్నాయి.
Read Also:Ashok Gehlot on Modi: మోదీ మొండితనం వల్లే రెండు రాష్ట్రాల్లో బీజేపీ ఓటమి: అశోక్ గెహ్లాట్
ఏప్రిల్ 20 న న్యూఢిల్లీలో, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ , అరుణాచల్ ముఖ్యమంత్రి పెమా ఖండూ సరిహద్దు రేఖను పరిష్కరించడానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమక్షంలో ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేశారు. సరిహద్దు వివాదాల పరిష్కారానికి ప్రయత్నాలకు ఊతం ఇచ్చేందుకు గతేడాది జూలైలో ఇద్దరు ముఖ్యమంత్రులు నంసాయి డిక్లరేషన్‌పై సంతకాలు చేశారు. 1972లో అరుణాచల్‌ప్రదేశ్‌కు కేంద్ర పాలిత ప్రాంతంగా, 1987లో రాష్ట్ర హోదా లభించింది.