Site icon NTV Telugu

Goods Train Derailed: పట్టాలు తప్పిన గూడ్స్‌ రైలు.. 8 ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల రాకపోకలకు అంతరాయం

Goods Train

Goods Train

Goods Train Derailed: మహారాష్ట్రలోని కసర రైల్వే స్టేషన్ సమీపంలో ఆదివారం గూడ్స్ రైలు రెండు కోచ్‌లు పట్టాలు తప్పినట్లు సెంట్రల్ రైల్వే తెలిపింది. గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో ఎనిమిది ఎక్స్‌ప్రెస్ రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఎనిమిది ఎక్స్ ప్రెస్ రైళ్లలో నాలుగింటిని దారి మళ్లించినట్లు సెంట్రల్ రైల్వే తెలిపింది. కసర నుంచి ఇగత్‌పురి డౌన్‌లైన్, మిడిల్ లైన్‌ మెయిల్ ఎక్స్‌ప్రెస్ ట్రాఫిక్ ప్రభావితమైందని సెంట్రల్ రైల్వే తెలిపింది. అయితే, ఇగత్‌పురి నుంచి కసర అప్‌లైన్ మధ్య సెక్షన్‌లో ట్రాఫిక్‌కు అంతరాయం కలగలేదు.

Read Also: Rajahmundry: ప్రధాన రహదారిలో ఒక్కసారిగా కుంగిపోయిన భూమి.. భయాందోళనకు గురైన స్థానికులు

ఎనిమిది ప్యాసింజర్ రైళ్లు కదలికలు ప్రభావితమయ్యాయి. 2261 ముంబై CSMT (ఛత్రపతి శివాజీ మహరాజ్ టెర్మినస్)-హౌరా ఎక్స్‌ప్రెస్ అసన్‌గావ్ స్టేషన్‌లో, 12105 CSMT-గోండియా విదర్భ ఎక్స్‌ప్రెస్ ఘట్‌కోపర్ స్టేషన్‌లో, 11401 CSMT-ఆదిలాబాద్, నందిగ్రామ్ ఎక్స్‌ప్రెస్‌ విక్రోలి స్టేషన్‌లో, 12109 CSMT- మన్మాడ్ పంచవతి ఎక్స్‌ప్రెస్, 17612 CSMT- నాందేడ్‌ ఎక్స్‌ప్రెస్, 12137 CSMT- ఫిరోజ్‌పూర్ పంజాబ్ మెయిల్ ఎక్స్‌ప్రెస్, 12173 LTT ప్రతాప్‌గఢ్ ఎక్స్‌ప్రెస్ కాసారా స్టేషన్‌లో, 12289 CSMT నాగ్‌పూర్ దురంతో ఎక్స్‌ప్రెస్‌లు ప్రభావితమయ్యాయి.

ఎనిమిది ఎక్స్‌ప్రెస్ రైళ్లలో, వాటిలో నాలుగు… 17612 CSMT నాందేడ్ ఎక్స్‌ప్రెస్, 12105 CSMT గోండియా ఎక్స్‌ప్రెస్, 12137 CSMT-ఫిరోజ్‌పూర్ పంజాబ్ మెయిల్ ఎక్స్‌ప్రెస్, 12289 CSMT నాగ్‌పూర్ దురంతో ఎక్స్‌ప్రెస్‌లు దారి మళ్లించబడ్డాయి. రైలు పట్టాలు తప్పినప్పటికీ ముంబై సబర్బన్ రైలు సేవలు ప్రభావితం కాలేదని సెంట్రల్ రైల్వే తెలిపింది. కళ్యాణ్, ఇగత్‌పురి నుండి రెండు ప్రమాద సహాయ రైళ్లను సంఘటనా స్థలానికి పంపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Exit mobile version