Site icon NTV Telugu

Commerce Subject : 5వ తరగతిలో కామర్స్ సబ్జెక్ట్..?

Paper

Paper

ఓ రాజకీయ నాయకుడు ఫిజిక్స్ లో కామర్స్ అంటే మనం అందరం నవ్వుకున్నాం.. కానీ 1943 సంవత్సరంలో ఐదవ తరగతిలోనే కామర్స్ సబ్జెక్ట్ ఉండేది అని తెలుస్తోంది. అంటే దాదాపు 80 సంవత్సరాల క్రితం పిల్లలు 5వ తరగతిలో ఉండగానే వ్యాపారం, వాణిజ్యం పాఠాలు నేర్చుకున్నాట్లు తెలుస్తోంది. రిటైర్డ్ ఐఎఎస్ భద్రీలాల్ స్వర్ణాకర్ దానికి సంబంధించిన ఓ ఫోట్ ను తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశాడు. 1943వ సంవత్సరానికి చెందిన 5వ తరగతి క్వశ్చన్ పేపర్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 1943-44 కి సంబంధించిన అర్ధవార్షిక పరీక్షలకు సంబంధించిన పేపర్ అది. ఈ ప్రశ్నాపత్రంలో గరిష్ట మార్కులు
100, పాస్ కావాల్సిన మార్కులు 33. ఇక 2.30 గంటల సమయంలోనే ఈ పరీక్ష పూర్తి చేయాలి అని అందులో ఉంది.

Also Read : Siddipet: సిద్దిపేట మహిళా డిగ్రీ కాలేజీలో చోరీ.. కంప్యూటర్లు ఎత్తుకెళ్లిన దొంగలు

బంగారం ధర నిర్ణయించడం ఎలా, వ్యాపారం గురించి లేఖ రాయమని ఇలా ప్రశ్నాపత్రంలో విద్యార్ధులను టీచర్స్ కోరారు. భద్రీలాల్ స్వర్ణాకర్ ‘భారతదేశంలో 1943-44 అర్ధ వార్షిక పరీక్ష ప్రమాణం చూడండి అంటూ ఈ ఫోట్ ను ట్విట్ చేశాడు. మెట్రిక్ సిస్టమ్ ను వ్యవస్థ ఎంతలా సులభతరం చేసింది’ అనే శీర్షికతో షేర్ చేశారు. ఇప్పుడు ఈ ప్రశ్నాపత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అప్పటి ప్రశ్నాపత్రం చూస్తే 10 ఏళ్ల పిల్లల వయసుకి చాలా కష్టమైన పరీక్షే. ఈ సబ్జెక్ట్ ఇంత క్లిష్టంగా ఉంటే మిగిలిన సబ్జెక్ట్స్ ఇంకెలా ఉండేవో? అంటూ నెట్టింట పెద్ద చర్చే జరుగుతుంది. కానీ అప్పటి వారికి ఇది గట్టి పునాదిగా చెప్పాలి. ఇప్పుటి జనరేషన్ పిల్లలకి ఇదే పేపర్ రాయమని ఇస్తే ఎన్ని ప్రశ్నలకు సమాధానం రాయగలుగుతారో కూడా తెలియదు.. అస్సలు ఈ జనరేషన్ పిల్లలు ఈ పేపర్ చూడగానే జంకుతారు.

Also Read : Karumuri Nageswara Rao: చంద్రబాబుని అరెస్ట్ చేస్తారు.. భయంతోనే జనంలోకి..!

Exit mobile version