Siddipet: సిద్దిపేట మహిళా డిగ్రీ కాలేజీలో చోరీ.. కంప్యూటర్లు ఎత్తుకెళ్లిన దొంగలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Siddipet: సిద్దిపేట జిల్లా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పట్టపగలు చోరీ తీవ్ర కలకం రేపింది. ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో దొంగలు చొరబడ్డారు. కంప్యూటర్లు, మానిటర్లు, ప్రింటర్లు వంటి విలువైన వస్తువులు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన సిద్దిపేట జిల్లాలో సంచలనంగా మారింది.
Read also: Raja Singh: సచివాలయంలో మీటింగ్ అని పిలిస్తేనే వచ్చా.. ఎందుకు అడ్డుకుంటున్నారు
Also Read
సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో దొంగలు చొరబడ్డారు. తాళాలు పగులగొట్టి డిగ్రీ కళాశాలలోకి ప్రవేశించారు. కళాశాలలోని ఒక కంప్యూటర్, మూడు మానిటర్లు, ఒక ప్రింటర్ ఎత్తుకెళ్లారు. ఈ చోరీపై ప్రభుత్వ డిగ్రీ మహిళా కళాశాల ప్రిన్సిపాల్ స్పందించారు. ఉదయం కళాశాలకు రాగానే తాళం పగులగొట్టి ఉండటం గమనించామని తెలిపారు. తాళం పగులగొట్టి లోపలికి వెళ్లి కంప్యూటర్లు, మానిటర్లు, ప్రింటర్లను ఎత్తుకెళ్లారని తెలిపారు. ఈ చోరీపై కళాశాల ప్రిన్సిపాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వెంటనే స్పందించిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని చోరీపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కళాశాలలోని సీసీ కెమెరాలను పరిశీలించారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దొంగలను గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. దొంగల కోసం పరిసర ప్రాంతాల్లో పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారని అన్నారు. అయితే కంప్యూటర్‌లోని కాలేజీకి సంబంధించిన విలువైన డేటా చోరీకి గురైనట్లు తెలుస్తోంది. ప్రభుత్వ మహిళా కళాశాలలో చోరీ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. మహిళా కళాశాలలో చోరీ చేయడం ఏంటని ప్రజలు మండిపడుతున్నారు. అధికారులు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరుతున్నారు.
Jabardasth Varsha : ఇంత ఎర్రగా ఉంటే ఎలా పాప.. కుర్రాళ్లు ఊరుకుంటారా
తాజావార్తలు
-
India vs Pakistan: నేడే భారత్-పాకిస్థాన్ గోల్డ్ మెడల్ ఫైట్.. ఎవరి బలం ఎంత? పూర్తి విశ్లేషణ ఇదే..!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..