Site icon NTV Telugu

Plane Crash : టాంజానియాలో కూలిన విమానం.. 19మంది మృతి

Tanzania Plane

Tanzania Plane

Plane Crash : టాంజానియా దేశానికి చెందిన విమానం సరస్సులో కూలిపోయింది.ల్యాండ్ కావడానికి ప్రయత్నించి 43 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ విమానం విక్టోరియా సరస్సులో కూలిపోయింది. ఈ ఘటనలో 19 మంది మృతి చెందారు. మరో 24ని మందిని అధికారులు రెస్క్యూ సిబ్బంది రక్షించారు. గల్లంతైన వారిలో పలువురు మృతి చెంది ఉంటారని భావిస్తున్నారు. ఘటనాస్థలికి చేరుకున్న రెస్క్యూ సిబ్బంది, స్థానిక మత్స్యకారులు సరస్సులో గల్లంతైన ప్రయాణికుల కోసం గాలిస్తున్నారు.

Read Also: Sania Mirza Divorce: షోయబ్‎తో విబేధాలు.. విడాకులు తీసుకోబోతున్న సానియా మీర్జా ?

బుకాబో ఎయిర్ పోర్ట్ కు 100 మీటర్ల దూరంలో ఉన్న విక్టోరియా సరస్సులో విమానం పడిపోయింది. పరిస్థితులు అదుపులోనే ఉన్నాయి. ప్రయాణికులను రక్షించేందుకు భద్రతా బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి’ అని బుకాబో రీజనల్ పోలీస్ కమాండర్ విలియమ్ వాంపఘేల్ తెలిపారు. మరోవైపు.. విమానంలో ప్రయాణికులు 49 మంది ఉన్నట్లు స్థానిక మీడియాలు నివేదించాయి. ఆ సంఖ్య ఎక్కువగానే ఉందని వార్తలు వస్తున్నాయి. కాగా ప్రమాదానికి గురయిన విమానం… ప్రెసిషన్ ఎయిర్ సంస్థకు చెందింది. ఇది టాంజానియాలో అతిపెద్ద ప్రైవేటు విమానయాన సంస్థ. ప్రమాదం నేపథ్యంలో విమాన ప్రమాదం జరిగినట్లు ధ్రువీకరిస్తూ ప్రెసిషన్ ఓ ప్రకటన చేసింది.

Read Also: Kamal ‘Indian2: విశ్వ నటుడికి విషెష్‎తో ఇండియన్ 2పోస్టర్ రిలీజ్.. స్టైల్ మామూలుగా లేదు

Exit mobile version