NTV Telugu Site icon

Heavy Rains: యూపీలో వర్ష బీభత్సంతో 19 మంది మృతి.. పలు రాష్ట్రాలకు IMD హెచ్చరిక

Rains

Rains

దేశంలోని పలు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని అనేక ప్రాంతాల్లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. దీంతో వర్షాల కారణంగా 19 మంది చనిపోయారు. అటు ఉత్తరాఖండ్‌లో కూడా కొండచరియలు విరిగిపడ్డాయి. అటు ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లోని అనేక ప్రాంతాల్లో నీరు ఎక్కడికక్కడా నిలిచిపోయాయి. మరోవైపు రానున్న కొద్ది రోజుల్లో పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ (ఐఎండీ) తెలుపుతుంది. అంతేకాకుండా పలు రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ.

Dil Raju: జవాన్ తో పాటు రిలీజైనా నిలదొక్కుకుంది.. ‘మిస్ శెట్టి’కి దిల్ రాజు ప్రశంసలు

సోమవారం వాతావరణ శాఖ తూర్పు ఉత్తరప్రదేశ్‌కు రెడ్ అలర్ట్ జారీ చేసింది. భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అటు ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు కోస్తా ఆంధ్ర ప్రదేశ్‌కు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. సెప్టెంబరు 11న కోస్తా ఆంధ్రప్రదేశ్‌లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలోని హైదరాబాద్‌లోనూ భారీ వర్షం కురిసింది.

IND vs PAK: శతక్కొట్టారు.. సెంచరీలతో అదరగొట్టిన కోహ్లీ, రాహుల్

ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకిలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా పలు చోట్ల భారీ నీటి ఎద్దడి నెలకొంది. భారీ వర్షం ప్రభావంతో బారాబంకి రైల్వే స్టేషన్‌లో కూడా రైల్వే ట్రాక్‌ నీటితో నిండిపోయింది. ఉత్తరప్రదేశ్‌లో గత 24 గంటల్లో వర్షాల కారణంగా 11 మంది మరణించారని రాష్ట్ర రిలీఫ్ కమిషనర్ తెలిపారు. కన్నౌజ్ జిల్లా లాల్కియాపూర్ గ్రామంలో వర్షం కారణంగా ఓ ఇల్లు కూలి ఇద్దరు అన్నదమ్ములు మరణించారు. అంతేకాకుండా భారీ వర్షాలు, నీట మునిగిన ఘటనల్లో హర్దోయ్‌లో నలుగురు, డియోరియా, కాన్పూర్ నగరం, రాంపూర్, సంభాల్ మరియు ఉన్నావ్‌లలో ఒక్కొక్కరు మరణించారు.

Rajinikanth: పీఎంతో జైలర్ భేటీ!

భారీ వర్షాల కారణంగా లక్నోలోని హజ్రత్‌గంజ్ ప్రాంతంలో నీటి ఎద్దడి ఏర్పడింది. ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌, హర్దోయ్‌లో కురుస్తున్న వర్షాల కారణంగా పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఉత్తరాఖండ్‌లోని చంపావత్‌లో కురుస్తున్న భారీ వర్షాలకు NH-9 పై కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో రహదారిని మూసివేశారు. మరోవైపు ఒడిశాలో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. సెప్టెంబర్ 13 నుంచి 15 వరకు ఒడిశాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఈశాన్య రాష్ట్రాల్లోనూ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. సెప్టెంబర్ 12న అస్సాం, మేఘాలయలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ తెలిపింది. అదే సమయంలో ఛత్తీస్‌గఢ్‌లో సెప్టెంబర్ 15న భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు.

Show comments